శుక్రవారం మారిన సీన్.. ఒక్కసారిగా బైడెన్ కు భద్రత పెంపు

Update: 2020-11-07 05:45 GMT
పోటాపోటీగా.. ఎవరు గెలుస్తారన్న ఉత్కంటతో గడిచిన మూడు రోజులుగా సాగుతున్న అనిశ్చితికి శుక్రవారం కాస్త క్లారిటీ వచ్చిందని చెప్పాలి. అధ్యక్ష స్థానాన్ని అందించే నాలుగు రాష్ట్రాల ఫలితాలు శుక్రవారం నాటికి వెలువడకపోయినప్పటికీ.. ఏం జరగబోతోందన్న విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది. తదుపరి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కే అవకాశాలు ఎక్కువన్న విషయం అంతకంతకూ అర్థమవుతోంది.

ఈ రోజు (శనివారం)న ఫలితాలు వెల్లడి కావాల్సిన నాలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్ర ఫలితం వెలవడటం.. అది కాస్తా బైడెన్ కు అనుకూలంగా ఉండటంతో.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న అంశంపై క్లారిటీ వచ్చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన మూడు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నా.. పెద్దగా పట్టింపు ఉండదని చెబుతున్నారు. ఈ వాదనకు తగ్గట్లే శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల్ని చెప్పొచ్చు.

పోలింగ్ ముగిసిన తర్వాత.. ఓట్ల లెక్కింపు.. అధిక్యత విషయంలో దోబుచులాటల వేళ.. కామ్ గా పరిస్థితిని గమనిస్తున్న అమెరికా సీక్రెట్ సర్వీస్.. శుక్రవారం అనూహ్యంగా స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అవకాశాలు భారీగా మెరుగుపర్చుకుంటున్న బైడెన్ కు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్ కు అదనపు ఏజెంట్లను పంపుతూ సీక్రెట్ సర్వీస్ నిర్ణయం తీసుకుంది. బైడెన్ వాహన శ్రేణిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ సంకేతంతో తదుపరి ఫలితం ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేయొచ్చని చెబుతున్నారు.
Tags:    

Similar News