హిందువుగా పుట్టడం కన్నా గాడిదగా పుట్టడం బెటర్: నాగబాబు

Update: 2020-06-12 09:10 GMT
మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు ఎంతకూ తగ్గట్లేదు. మొన్ననే గాడ్సే పై, బాలక్రిష్ణపై సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన నాగబాబు తాజాగా మరోసారి తన ఆక్రోషం వెళ్లగక్కారు. తాజాగా కశ్మీర్ లో హత్యకు గురైన ఒక హిందూ పండిట్ పై నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.

నాగబాబు ట్వీట్ చేస్తూ.. ‘‘నాకు నిన్నే తెలిసింది కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు. ఫరవాలేదు... చచ్చింది హిందూ పండిట్ కదా. చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు. ఎక్కడో కాశ్మీరీ పండిట్, మనచుట్టం కాదు మన స్టేట్ కాదు.. ఎక్కడో లయాడ్ అనే నల్లజాతి వ్యక్తి ని చంపితే ఇండియా లో కూడా స్పందించారు’’ అంటూ భారతీయ హిందూ పండిట్ హత్యనపై నిప్పులు చెరిగారు.

ఇక అంతటితో ఆగకుండా గాడిదల పుట్టినా బాగుండు అంటూ స్పందించని ఈ జనాల పై నాగబాబు విరుచుకు పడ్డారు. వరుస గా ఈ ఇష్యూ పై ట్వీట్లు చేశారు. ‘కానీ ఇది ఇండియా కదా.. ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు స్పందించక్కరలేదు.కనీసం హిందువులకి,హిందు సంస్థల కయినా బాధ్యత ఉండాలి కదా. మన రక్తం గడ్డ కట్టుకొని పోయింది. ఈ దేశం లో హిందువు గా పుట్టటం కన్నా ఒక గాడిద గా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది’ అంటూ నాగబాబు తన అసహాయతను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

ఇక తన ట్వీట్ లో బీజేపీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు నాగబాబు.. ‘నాకు తెలిసి హిందు దేశం లో ఆఖరి హిందువు చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్. ఇంకా అక్కడ్నుంచి మనం మహమ్మదీయ చక్రవర్తులు పాలనలో నలిగి పోయాం. బ్రిటిష్ పాలన లో.. స్వతంత్రమ్ వచ్చాక కూడా బ్రిటిష్ ఏజెంట్ల పాలనలో నలిగిపోయాం. ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానం గా చూసే ఒక పార్టీ పాలన లో ఉన్నాం’ అంటూ బీజేపీకి మద్దతుగా ట్వీట్ చేశారు నాగబాబు..

ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలనే హిందువుల హత్యలు హైలెట్ చేయలేదని నాగబాబు దుయ్యబట్టారు. హిందూ పండిట్ హత్యకు కారకులని పట్టుకొని వాళ్లని శిక్షించాలని నాగబాబు డిమాండ్ చేశారు.
Tags:    

Similar News