విజ‌య్‌పై ఆఖ‌రి అస్త్రం.. పాలిటిక్స్ అంతే!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతున్న త‌మిళ వెట్రిగ క‌గ‌ళం(టీవీకే) పార్టీ చీఫ్‌, హీరో విజ‌య్‌కు ఊపిరి స‌ల‌ప‌డం లేదు.;

Update: 2026-02-28 10:35 GMT

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతున్న త‌మిళ వెట్రిగ క‌గ‌ళం(టీవీకే) పార్టీ చీఫ్‌, హీరో విజ‌య్‌కు ఊపిరి స‌ల‌ప‌డం లేదు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఆయ‌న‌ను స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఈ ప‌రంప‌రలో ఆఖ‌రి అస్త్రం.. ఆయ‌న సతీమ‌ణి సంగీత‌. ఎంతో ప్రేమిం చి పెళ్లి చేసుకున్న సంగీత‌.. ఇప్పుడు త‌న‌కు విడాకులు కావాల‌ని కోరుతూ.. కోర్టును ఆశ్ర‌యించ‌డంతో త‌మిళ‌నాట ఇది హాట్ టాపిక్‌గా మారింది.

విజ‌య్ ఇలాంటోడా! అంటూ.. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. శ‌నివారం త‌మిళ నాడు అన్ని ప‌త్రిక‌లు ఈ విష‌యాన్ని ప్ర‌ధాన ప‌తాక శీర్షిక‌ల్లో ముద్రించ‌డం విశేషం. వేరే న‌టితో విజ‌య్ వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడ‌ని.. ఆయ‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మారాల‌ని చెప్పినా వినిపించుకో లేద‌ని.. అందుకే విడాకులు కోరుతున్నాన‌ని సంగీత త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ‌ను కోర్టు ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఖ‌చ్చితంగా అప్పుడే త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నా యి.

సెంటిమెంటుపైనే..

వాస్త‌వానికి సంగీత‌తో విజ‌య్ మూడేళ్ల‌కుపైగానే దూరంగా ఉంటున్నారు. ఈ విష‌యాన్ని ఆమే త‌న పిటిష న్‌లో పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా తమిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు ఆమె పిటిష‌న్ రూపంలో తెర‌మీదికి రావ‌డం వెనుక ఎవ‌రో ఉన్నార‌న్నది టీవీకే నాయ‌కులు చెబుతున్న మాట‌. దీనికి ద‌న్నుగా కొన్ని రోజుల కింద‌ట‌.. బీజేపీ రాష్ట్ర చీఫ్ న‌య‌నార్ నాగేంద్ర చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. త్రిష కౌగిలి నుంచి విజ‌య్ బ‌య‌ట‌కు రావాలంటూ.. ఆయ‌న అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు.

త‌మిళుల‌కు సెంటిమెంటు ఎక్కువ‌. ముఖ్యంగా వివాహేత‌ర సంబంధాల విష‌యంలో త‌మిళులు నిక్క చ్చిగా ఉంటారు. ఈ సెంటిమెంటే ఇప్పుడు విజ‌య్‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. దీని నుంచి ఆయ‌న తేరుకుని బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోవాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు కోరుకుంటున్న ఆకాంక్ష‌. ఇక‌, ఇప్ప‌టికే.. గ‌త ఏడాది జ‌రిగిన క‌రూర్ తొక్కిస‌లాట కేసు విజ‌య్‌ను వెంటాడుతోంది. అదేవిధంగా ఆయ‌న న‌టించిన ఆఖ‌రి సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. ఇప్పుడు భార్య రూపంలో మ‌రో సెంటిమెంటు కేసు.. వెర‌సి విజ‌య్‌కు ఊపిరి ఆడ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News