ఇళ్లు అద్దెకు కావాలంటే క్వాలిఫికేషన్ ఉండాల్సిందే!

Update: 2022-11-28 06:34 GMT
ఇండియన్ సిలికాన్ వ్యాలీ.. ఐటీ సిటీ బెంగళూరులో ఒక రూం అద్దెకు కావాలంటే చాలా గగనం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అక్కడ ఉద్యోగం, ఉపాధి కోసం తరలివస్తుంటారు. సో ఇక్కడ ఒక్క రూం ఉంటే చాలు అద్దెలతోనే బతికేయవచ్చు అని చెబుతుంటారు. అంతలా అభివృద్ధిలో బెంగళూరు దూసుకుపోతోంది. ఇక్కడికి మన చిత్తూరు, అనంతపురం వాసులు, నేతలకు కూడా భారీ ఆస్తిపాస్తులున్నాయి.

అయితే బెంగళూరులో ఇళ్లు అద్దెకు కావాలంటే కేవలం అద్దె ఇస్తే సరిపోదు. ఇంటి యజమానులకు నచ్చిన చదువులు కూడా చదివి ఉండాలట.. ప్రియాంష్ జైన్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

ఫ్లాట్ కోసం ఓ ఏజెంట్ ను సంప్రదించగా.. ప్రియాంష్ చేస్తున్న పనితోపాటు బ్యాగ్రౌండ్ తెలుసుకొని ఇళ్లు అద్దెకు ఇవ్వడం కుదరదని వాళ్లు తెలిపారట.. దీంతో ప్రియాంష్ ఈ విషయం తెలుసుకొని అవాక్కవ్వడం వారి వంతు అయ్యింది.

ఇంటి యజమానులు కేవలం ఐఐఎం, లేదా ఐఐటీ చదివిన వారికే ఇళ్లు అద్దెకు ఇస్తారట.. అంతపెద్ద చదువులు చదివి కార్పొరేట్ జాబ్ చేస్తున్న వారికే ఉద్యోగాలు ఇస్తామంటే ఇక తమ గతి ఏం కాను అని అందరూ వాపోతున్న పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. ప్రియాంష్ సోషల్ మీడియాలో పెట్టడంతో బెంగళూరులో అద్దె ఇళ్ల పరిస్థితి.. డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ఐటీ ప్రొఫెషనల్స్ కే ఇంత అద్దె ఇళ్ల కష్టాలు ఉంటే ఇక సామాన్యులు, మధ్యతరగతి వారికి అక్కడ ఇళ్లు దొరకడం కష్టమేనంటున్నారు. లక్షల డిపాజిట్, వేల అద్దెలు చెల్లించే స్థోమత ఉంటేనే బెంగలూరులో జీవించగలమని.. అంత చెల్లించకపోతే బతకడం కష్టం అని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News