కౌంట్ డౌన్ మొదలైందట.. మరో పాతికేళ్లలో పురుషాంగం సైజు సంగతి అంతేనట

Update: 2021-03-27 23:30 GMT
‘సైజ్ డజ్ మేటర్’ అన్న మాట పురుషాంగం విషయంలో వినిపిస్తూ ఉంటుంది. దీని మీద ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ.. పురుషాంగం ఎంత పెద్దదైతే.. అంత సుఖాన్ని అందిస్తారన్న మాట ఇప్పటిది కాదు.. దీనిపై చర్చ ఏళ్లకు ఏళ్లుగా సాగుతోంది. సోషల్ మీడియాలో దీని మీద జరిగే డిబేట్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇప్పుడు చర్చ జరగాల్సింది ‘సైజు’ మీద కాదట. అసలు పురుషాంగం ఉంటుందా? ఉండదా? అన్న దారుణమైన పరిస్థితుల్లోకి మగమహారాజులు జారిపోతున్న షాకింగ్ నిజాన్నితాజాగా విడుదలైన ఒక నివేదిక హెచ్చరిస్తోంది.

కాలం గడిచే కొద్దీ పురుషాంగం సైజు తగ్గిపోతుందని.. ఇదే కొనసాగితే కొంతకాలానికి మినిమం సైజు అయినా ఉంటుందా? ఉండదా? అన్నది ప్రశ్నగా మారుతుందంటున్నారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమన్న విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ షన్నా స్వాన్ ‘‘కౌంట్ డౌన్’’  పుస్తకంలో రానున్న రోజుల్లో పురుషులు ఎదుర్కొనే సమస్యల గురించి తెలిపారు.  

సంతానం విషయంలో మనుషులు అస్తిత్వ సంక్షోభం ఎదుర్కోనున్నట్లు తెలిపారు. పరుషాంగం సైజు క్రమేపీ తగ్గిపోవటం.. వీర్యకణాల ఉత్పత్తిలో సమస్యలతోనే ఈ తరహా సంక్షోభం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోవటం.. అంగ పరిమానం తగ్గిపోవటానికి కారణం.. కాలుష్యమేనని చెబుతున్నారు. ప్లాస్టిక్ తయారీలో వినియోగించే థాలేట్ అనే రసాయనం హర్మోన్లను ఉత్పత్తి చేసే ఎండోక్రైన్ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్ని తెలుసుకునేందుకు ఎలుకలపై పలు పరిశోధనలు జరిపారు. పిండాలు థాలెట్ రసాయనిక చర్యకు గురైనప్పుడు పుట్టే బిడ్డ జననేంద్రియాలు కుచించుకుపోతున్నట్లుగా గుర్తించారు. మృదువుగా ఉండే ప్లాస్టిక్ బొమ్మల్లో థాలేట్ ను వినియోగిస్తారని.. అది ఆడుకునే బొమ్మలు.. వస్తువుల ద్వారా శరీరంలోకి చేరి.. ఈస్ట్రోజెన్ అనే హర్మోన్ మీద ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొంటున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే 2045 నాటికి పురుషులు సంతానం కోసం అవసరమైన వీర్య కణాల్ని కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితికి వెళతారని చెబుతున్నారు. సో.. ప్లాస్టిక్ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండటం చాలా అవసరమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News