గాల్వాన్ ఘటనలో బీబీసీ అలా.. న్యూయార్క్ టైమ్ ఇలా!

Update: 2020-06-18 08:30 GMT
పెను సంచలనంగా మారిన గాల్వాన్ ఘటన.. భారత్ - చైనాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు కారణమైంది. డ్రాగన్ కుయుక్తి పుణ్యమా అని రెండు దేశాలకు చెందిన సైనికులు మరణించారు. భారత సైనికుల వీర మరణాన్ని ముందే ప్రకటించగా.. చైనా మాత్రం తన సైనికుల మరణాల్ని మాత్రం ఆలస్యంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలపై ప్రముఖ విదేశీ మీడియా సంస్థలు ఏ రీతిలో రియాక్ట్ అయ్యాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రముఖ మీడియా సంస్థలైన న్యూయార్క్ టైమ్స్ ఒకలా రియాక్ట్ అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బీబీసీ మరోలా రియాక్ట్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఉద్రిక్తల నడుమ తన సరిహద్దుల వెంబడి పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరించింది చైనా.

గాల్వాన్ ఘటన పై అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ చెప్పింది చూస్తే.. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున సైనికుల్ని మొహరించి ఉండటంతో ఉద్రిక్తల్లో నిప్పు రాజేసినట్లుగా పేర్కొంది. ఇదిలా ఉండగా.. బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ గాల్వాన్ ఘటనపై స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంట ఒకరి భూభాగంలోకి ఒకరు దూసుకెళ్లినట్లుగా పేర్కొనటం గమనార్హం. రెండు ప్రముఖ సంస్థల వాదన వేర్వేరుగా ఉండటం గమనార్హం.
Tags:    

Similar News