గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బతుకు అంత దారుణంగా ఉంటుందా?

Update: 2020-11-30 06:45 GMT
తూటాల్లాంటి మాటలు.. వెనుకా ముందు చూసుకోకుండా రాజకీయ ప్రత్యర్థిని ఎంత మాట అయినా అనేందుకు ఏ మాత్రం మొహమాటపడని నేతగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను చెప్పాలి. ఆయనకు ముందుగా పని చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులంతా పెద్ద మనుషులు తరహాలో.. ప్యూర్ వెజ్ అన్నట్లుగా ఉండేవారు. కానీ.. ఆయన మాత్రం అందుకు భిన్నం. ప్యూర్ నాన్ వెజ్ అన్నట్లుగా ఉండటమే కాదు.. సంచలన వ్యాఖ్యలకు.. దూకుడు స్టేట్ మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు.. వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకు బర్ బాద్ కావటం ఖాయమన్నారు. సీఎం.. డీజీపీ మాటల్ని నగర ప్రజలు నమ్మొద్దని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ నేతలు బిర్యానీ సెంటర్లు.. చాయ్ సెంటర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు.

‘ఇక్కడకు అమిత్ షా వచ్చి వారి బిర్యానీ తినిపోవటం ఖాయం. బీజేపీ అభ్యర్థుల తరఫున జాతీయ నాయకత్వం ప్రచారానికి వచ్చింది. టీఆర్ఎస్ కు ఎవరూ దిక్కులేరు’’ అని ఎద్దేవా చేశారు. ఫేక్ వీడియోలు తయారు చేసిన వారిపైనా.. వాటిని ప్రసారం చేసే వారిపైనా చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరుతున్నారు. టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
Tags:    

Similar News