బాలయ్యకు తప్ప ఇంకెవరికీ పట్టదా ?
తెలుగుదేశంపార్టీలో చంద్రబాబునాయుడు బావమరిది కమ్ హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు తప్ప ప్రజాసమస్యలు ఇంకెవరికీ పట్టలేదా అనే సందేహం పెరిగిపోతోంది. ఇపుడు ప్రజాసమస్యంటే కరోనా వైరస్ కు మించిన సమస్య ఇంకేముంటుంది. ఆలస్యంగానే అయినా బాలయ్య గట్టిగానే స్పందించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో తన నియోజకవర్గంలో 2 వేలమంది కరోనా రోగులకు ప్రత్యేక మందుల కిట్ల పంపిణీకి రెడీ అయ్యారు.
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో మందుల కిట్లు ఇప్పటికే హిందుపురం చేరుకున్నాయి. కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకు 15 రకాల మందులున్న ప్రత్యేక కిట్లను పంపిణీ చేయనున్నట్లు బాలయ్య చెప్పారు. ఒక్కో మెడికల్ కిట్ రు. 1100 కోట్లని సమాచారం. కోవిడ్ సోకినవారి ఆధార్ కార్డుతో పాటు పాజిటివ్ రిపోర్టు కాపీని తీసుకొచ్చి ఇవ్వాలని బాలయ్య చెప్పారు.
రోగుల తరపున వచ్చే వారికి తాము మందుల కిట్లను ఇస్తామన్నారు. ఈ కిట్లో 14 రోజులకు సరిపడా మందులుంటాయన్నారు. అంతా బాగానే ఉందికానీ టీడీపీ మొత్తం మీద ఈ తరహా మందుల కిట్లను రోగులకు పంపిణీ చేస్తున్నది ఒక్క బాలయ్య మాత్రమే అనిపిస్తోంది. బాలయ్యతో పాటు చంద్రబాబుతో కలుపుకుని 23 మంది ఎంఎల్ఏలున్నారు. మరో ముగ్గురు ఎంపిలున్నారు. వీళ్ళెవరు కరోనా రోగులకు మందుల పంపిణీ కానీ లేదా ఇతరత్రా ఏదో సాయం కూడా చేస్తున్నట్లు లేదు.
టీడీపీలో కొన్నివేలమంది మాజీ ప్రజాప్రతినిధులున్నారు. వీరిలో ఓ 20 శాతంమంది రోగులకు సహాయం చేసినా సమస్య ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక పార్టీలో డాక్టర్లు, పార్టీ సానుభూతిపరులుగా ఉన్న డాక్టర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళలో కూడా ఎవరు బాలయ్య లాగ కనీసం మందుల కిట్లు కూడా పంపిణి చేసినట్లు లేదు. మందుల కిట్లు, భోజన సదుపాయం, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు ఇలా...జనాలకు ఉపయోగపడే ఏదో ఓ సాయం చేయచ్చు. మరి ఎందుకని ఎవరు ముందుకు రావటంలేదు ?