ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా ..వైసీపీ పై నిప్పులు చెరిగిన బాలయ్య
ఏపీ పంచయాతీ ఎన్నికల ఫలితాలను అధికార పార్టీ తారుమారు చేసిందని టీడీపీ బయటకు చెబుతున్నా పార్టీలో మాత్రం అంతర్మథనం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ మద్దతు దారులకు డిపాజిట్ లేని పరిస్థితి కనిపించింది. దీనితో మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని చూస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని మేజర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. సాధారణంగా పల్లె ఓటు బ్యాంకుతో పోలిస్తే పట్టణ ఓటర్లలో టీడీపీకి కొంత పట్టు ఉంటుంది. అందుకే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా తమ పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్ ను రంగంలోకి దించింది టీడీపీ.
హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్న బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకరు చంద్రబాబుని తిట్టడానికి పనిచేస్తున్నారని, మరొకరు ఇసుక మాఫియా, ఇంకొకరు లిక్కర్ మాఫియా, నాలుగవ మంత్రి మైనింగ్ మాఫియా అంటూ విమర్శలు గుప్పించారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గౌరవంగా ఉండే వారిని, వైసిపి హయాంలో వారి పరిస్థితి మారిపోయింది. మంత్రులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో యువత భవిష్యత్తును అంధకారమయం చేశారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అడిగి, రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. అందుకే మున్సిపల్ ఎన్నికలలో అయినా జవాబుదారీతనం ఉన్న పార్టీని ఎంచుకొని ఓటేయాలని బాలయ్య ఓటర్లను కోరారు. హిందూపురం నియోజకవర్గం లో గతంలో టిడిపి హయాంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని , వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. హిందూపురంలో రెండేళ్ల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బాలకృష్ణ, హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
అయితే , బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం పెద్దగా కనిపించలేదు.రోడ్ షోలకు ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో బాలకృష్ణ కొంచెం అసహనానికి గురయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల్లో బాలయ్య ప్రచారం వైసీపీ ని ఎంతమాత్రం కట్టడి చేస్తుందో.