రాక రాక విశాఖకు రాహుల్...టూర్ ఇంట్రెస్టింగ్

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విశాఖ టూర్ కి వస్తున్నారు. ఆయన లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన తరువాత విశాఖకు రావడం ఇదే తొలిసారి.;

Update: 2026-01-18 16:30 GMT

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విశాఖ టూర్ కి వస్తున్నారు. ఆయన లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన తరువాత విశాఖకు రావడం ఇదే తొలిసారి. ఆ మాటకు వస్తే 2022 తరువాత రాహుల్ గాంధీ ఏపీకి కూడా వచ్చింది లేదు. ఇక అప్పట్లో భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ దేశమంతా పర్యటించారు. అందులో భాగంగా ఆయన అనంతపురం కర్నూలు జిల్లాలో కొంత భాగంలో పాదయాత్ర చేశారు. ఇక రాహుల్ గాంధీ గాడచిన మూడున్నరేళ్ళలో ఏపీ వైపు చూసింది లేదు, అదిగో ఇదిగో అని అంటున్నారు కానీ రావడం లేదు అని ప్రచారంలో ఉంది.

స్టీల్ ప్లాంట్ విషయంలో :

విశాఖ ఉక్కు కర్మాగారం బలిపీఠం మీద ఉందని అంటున్నారు. 2021 జనవరి నెలాఖరులో ఈ ప్లాంట్ లో పెట్టుబడులు నూరు శాతం ఉప సంహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ కేబినెట్ కమిటీ నిర్ణయించింది అని చెబుతున్నారు. ఆ తరువాత నుంచి స్టీల్ ప్లాంట్ విషయంలో ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అయిదేళ్ళు దాటుతోంది, ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని చెబుతున్నారు కానీ ఆనాడి కేబినెట్ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడం జరగలేదని గుర్తు చేస్తున్నారు. దాంతో వామపక్షాలు ప్రజా సంఘాలు అన్నీ కలసి ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఈ ఆందోళనలో కీలకం అవుతుందని రాహుల్ గాంధీ స్వయంగా విశాఖ వచ్చి భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పుకున్నారు కానీ అది ఇప్పటిదాకా జరగలేదు, ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ విశాఖ వస్తున్నారు అన్న వార్తలు అయితే చర్చనీయాంశంగా మారాయి.

అధికారిక పర్యటన :

అయితే రాహుల్ గాంధీ విశాఖ వస్తున్నది అధికారిక పర్యటనలో భాగంగా అని అంటున్నారు. ఆయన ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటిస్తున్నారు అని చెబుతున్నారు. కేంద్ర పార్లమెంటరీ రక్షణ కమిటీ విశాఖలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఆ కమిటీలో మొత్తం ఎంపీలు వస్తున్నారు. రాధా మోహన్ నేతృత్వంలో విశాఖ వస్తున్న ఈ బృందంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.

విశాఖలో పరిశీలన :

ఇక కేంద్ర కేంద్ర పార్లమెంటరీ రక్షణ కమిటీ విశాఖలో మూడు రోజుల పర్యటనలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను సందర్శిస్తుంది అని భోగట్టా. విశాఖలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి డీఆర్డీ అలాగే ఎన్ఎస్ టీఎల్ వంటివి ఉన్నాయి. వీటిలో రక్షణ పరమైన అంశాలను కేంద్ర కమిటీ పరిశీలిస్తుంది అని చెబుతున్నారు. అలాగే విశాఖలో అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. కోస్ట్ గార్డు పరిధిలోని ఈ ప్రాంతం భద్రత కూడా కేంద్రానికి ఎంతో అవసరం. కేంద్రం నిఘాలో ఉంటుంది. దాంతో అక్కడ భద్రతకు తీసుకుంటున్న చర్యలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది అని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ సందర్శన :

కేంద్ర పార్లమెంటరీ రక్షణ కమిటీతో కలిసి వస్తున్న రాహుల్ గాంధీ అనధికార కార్యక్రమాలలో పాల్గొంటారా అన్నది చర్చగా ఉంది. ఆయన రాక కోసం అయితే స్టీల్ ప్లాంట్ ఎదురుచూస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద రాహుల్ పార్లమెంట్ లో గళమెత్తాలని అంతా కోరుతున్నారు. అయితే రాహుల్ వస్తున్నది కాంగ్రెస్ నేత హోదాలో కాదని అధికారిక కార్యక్రమం అని చెబుతున్నారు. కానీ రాహుల్ గాంధీ స్థానికంగా కాంగ్రెస్ నేతలను కూడా కల్సుతారని అంటున్నారు. అలాగే ఉక్కు ఉద్యమ కారులు కూడా ఆయనతో భేటీ అయి వినతిపత్రం అందిస్తారు అని చెబుతున్నారు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఉక్కు పోరాటాన్ని మరింతగా జాతీయ స్థాయిలో చర్చకు పెట్టాలని చూస్తున్నారు. ఏది ఏమైనా చాలా కాలానికి రాహుల్ విశాఖ రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News