మిడిల్ క్లాస్ సొంతింటి కల...నిర్మలమ్మ బడ్జెట్ పై ఆశలు

ఇక దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఎక్కువగా మధ్యతరతి వర్గాల మీదనే ఆధారపడి సాగుతోంది.;

Update: 2026-01-18 19:30 GMT

కేంద్ర బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టడాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 13 రోజులలో బడ్జెట్ ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ మీద దేశంలోని 140 కోట్ల మంది ప్రజానీకంలో శతకోటి ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు తమకేమిటి ఈ బడ్జెట్ లో మోసుకుని వస్తున్నారు అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ దేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారులుగా మధ్యతరగతి వర్గాలు ఉన్నాయి. బడ్జెట్ వైపే ఎపుడూ వారి చూపు ఉంటుంది. తమకు రాయితీలు పెద్ద ఎత్తున అందించాలని వారు కోరుకుంటూ ఉంటారు.

సొంత ఇల్లు ఉండాలి :

అందరికీ సొంతిల్లు అని కేంద్ర ప్రభుత్వం విధానంగా తీసుకుంది. నినాదంగా జనంలో ఉంది కానీ ఆచరణలో మాత్రం ఈ రోజుకీ చాలా మందికి అది కలగానే ఉంది. సొంతిల్లు అన్నది లేని వారే అత్యధికంగా ఉన్నారు. పట్టణాలలో అద్దె ఇల్లలో వారు ఉంటున్నారు. సొంత ఇంటి కోరిక తీరాలంటే వారికి రాయితీలు ప్రోత్సాహకాలు అవసరం అని అంటున్నారు. ముఖ్యంగా పన్నులో రాయితీలు కావాలని అలాగే హోం లోన్ వడ్డీ రాయితీలు పెంపు వంటివి కూడా మరింతగా పెంచాలని కోరుతున్నారు. అలా చేస్తే కనుక తాము కూడా సొంతిల్లు కొనుగోలు చేసుకుంటామని అంటున్నారు.

రియల్టర్ల కోరిక కూడా :

ఇక దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఎక్కువగా మధ్యతరతి వర్గాల మీదనే ఆధారపడి సాగుతోంది. కానీ ఇపుడు వారి నుంచి తగిన స్పందన రాక డీలా పడుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎక్కువగా లగ్జరీ అపార్ట్మెంట్స్ అతి పెద్ద నిర్మాళాకు మాత్రమే డిమాండ్ ఉంటోంది, మిడిల్ క్లాస్ కి వర్తించే విధంగా వారిని ఆకట్టుకునే విధంగా నిర్మించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం రియల్ ఎస్టేట్ రంగానికి అందించాలని కోరుతున్నారు. ఇక ఇంటి మీద రుణం వడ్డీ మినహాయింపులను రెండు లక్షల నుంచి అయిదు లక్షల వరకూ పెంచాలని సూచనలు ఉన్నాయి. పన్ను రాయితీలు పెద్ద ఎత్తున ఇస్తే కూడా కొనుగోలు దారులకు సులువుగా ఉంటుందని చెబుతున్నారు.

మిడిల్ క్లాస్ తోనే అంతా :

రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవాలీ అంటే మిడిల్ క్లాస్ ని ఎట్రాక్ట్ చేయాల్సిందే అని అంటున్నారు. ఆ విధంగా రాయితీలు లభిస్తే ఇళ్ళ నిర్మాణం పెరుగుతుందని రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోని నిపుణులు చెబుతున్నారు. ఇక రీజనబుల్ గా ధరల పరిమితిని పెంచాలని పట్టణాలలో ఉన్న ధరల విషయంలో వాస్తవికత ఉండాలని ఆ విధంగా ప్రమాణాలు సవరించాలని కోరుతున్నారు.

గృహ నిర్మాణానికి సైతం :

గృహ నిర్మాణానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుగుణమైన పద్ధతిలో రాయితీలు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అలా చేస్తే పట్టణాలలో మిడిల్ క్లాస్ కోసం గృహ నిర్మాణం పెద్ద ఎత్తున పెరుగుతుందని చెబుతున్నారు. మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మిడిల్ క్లాస్ కి సొంతింటి కలను ఏ విధంగా నెరవేరుస్తారో చూడాల్సి ఉంది. రాయితీలు ఇస్తే అందరికీ ఇళ్ళు అన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు సాకారం అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News