తండ్రీకొడుకులకు బాలయ్య విషెస్

Update: 2016-02-06 07:29 GMT
గ్రేటర్ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంపై తెలంగాణ అధికారపక్షం ఆనందంతో తబ్బిబుబ్బి పోతోంది. టీఆర్ ఎస్ సాధించిన విజయంపై పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు పలువురు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రి కేటీఆర్ కు అభినందనలు తెలుపుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో దగ్గరుండి మరీ ప్రచారం మొదలు.. గ్రేటర్ వ్యూహాన్ని అమలు చేసిన మంత్రి కేటీఆర్ పైనా సర్వత్రా అభినందల వర్షం కురుస్తోంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు బాలయ్యబాబు.. కేసీఆర్ కు ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. ఇలా విషెస్ తెలిపిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ.. మోహన్ బాబు.. తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు.. ఆయన తనయుడు.. మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేస్తున్న పలువురు ఆయన అభినందిస్తున్నారు. తాజా ఎన్నికలతో కేటీఆర్ శక్తిసామర్థ్యాలు బయటకు రావటంతోపాటు.. ఆయనెంత సమర్థంగా వ్యవహరించగలరన్న విషయం గ్రేటర్ ఎన్నికలతో స్పష్టమైందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.
Tags:    

Similar News