• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉద్యోగుల‌కు బాబు...

ఉద్యోగుల‌కు బాబు మ‌ద్ద‌తు.. తాజా పిలుపు ఇదే!

By - Tupaki Desk
Update: 2022-01-22 10:35 GMT
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత‌ చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా టీడీపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై మండల, నియోజకవర్గ నేతలతో తాజాగా నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జీతాలు పెంచమంటే.. తగ్గించిన ప్రభుత్వం ఇది మాత్రమే. ఉద్యోగులను ప్రభుత్వం తీవ్రంగా మోసగించింది...’ అని చంద్రబాబు మండిపడ్డారు.

‘రహదారులపై గుంతలు పూడ్చలేని జగన్‌... జిల్లాకో విమానాశ్రయం కడతానని చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలు, పన్నులు, అధికారిక దోపిడీలతో ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభుత్వం దారుణంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడే పరిస్థితి వస్తుంది. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల దోపిడీ తీవ్రంగా ఉంది. వాటిపై మండల, నియోజకవర్గ స్థాయి టీడపీ నేతలు పోరాటాలు చేయాలి`` అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్ని చోట్ల అనుకున్నంత ధాటిగా పోరాటాలు జరగడం లేదని బాబు అన్నారు. అలాంటి చోట్ల నేతలు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పూర్తి సమాచారం ఉందన్న ఆయ‌న మరింత దూకుడుగా వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారని  చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పద‌న్నారు. ఈ విషయంలో ఆ పార్టీ వర్గాల్లోనే క్లారిటీ వచ్చిందని తెలిపారు. తమ కష్టాలు పోవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని చంద్ర‌బాబు తెలిపారు.

వ‌లంటీర్ల వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు చేర్పించడం, ఒకే కుటుంబం ఓట్లను వేర్వేరు డివిజన్లకు మార్చడం వంటి చర్యలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్ర‌బాబు సూచించారు. ఒక రాజకీయపార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా ముఖ్య‌మేన‌ని తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి కొవిడ్‌ రోగులకు మళ్లీ ఉచితంగా సేవలు ప్రారంభించామ‌ని చెప్పారు. ప్రభుత్వం సాయం చేయకున్నా...ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి ఉచిత వైద్య సాయంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నామ‌ని వివ‌రించారు. 
Tags:    
  • PRC Issue 
  • AP PRC Issue 
  • Andhra Pradesh 
  • AP Sarkar 
  • AP employees 
  • Chief Secretary Sameer Sharma 
  • jagan mohan reddy 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS