అధికారులపై అయ్యన్న బూతు పురాణం
మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోమారు బూతు పురాణం వినిపించారు. అధికారులపై బూతులతో విరుచుకుపడ్డారు. గీతం యూనివర్సిటి కాంపౌండ్ వాలును, యూనివర్సిటి ప్రధాన ద్వారాన్ని రెవిన్యు అధికారులు కూల్చేసిన ఘటనపై అయ్యన్న మీడియా సమావేశం పెట్టారు. ఆ సందర్భంగా ఆర్డీవో, ఎంఆర్వోలను నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. వేలాదిమంది విద్యార్ధులకు చదువు చెబుతున్న యూనివర్సిటి కాంపౌండ్ వాల్ ను ప్రభుత్వం ఎలా కూల్చేస్తుందంటు పెద్ద లాజిక్ లాగారు. అర్ధరాత్రి వెళ్ళి కూల్చివేతలకు దిగిన రెవిన్యు సిబ్బందిని అమ్మనాబూతులు తిట్టారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టు పరిధిలో ఉన్నన నిర్మాణాలను ప్రభుత్వం ఎలా కూల్చేస్తుందంటూ కోపంతో ఊగిపోయారు. అధికారులను పట్టుకుని గాడిదకొడుకులు అంటూ మండిపోయారు. ముందు ఆ నా...లపై కేసులు పెట్టాలంటూ నోటికి పనిచెప్పారు. రాయటానికి కూడా వీల్లేనట్లుగా అయ్యన్న తిట్ల పురాణం అందుకోవటంతో అందరు ఆశ్చర్యపోయారు. నిజానికి అయ్యన్నకున్న నోటి దురుసు అందరికీ తెలిసిందే.
ఆమధ్య నర్సీపట్నం మున్సిపాల్ మహిళా కమీషనర్ ను పట్టుకుని అందరిముందు బట్టలూడదీసి తంతానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాంతో ఆమె అయ్యన్నపై కేసు పెట్టారు. పోలీసులు అరెస్టు చేయటానికి వస్తే పరారీ అయిపోయన చింతకాయల కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుని ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ అధికారులను ఉద్దేశించి ఇదే పద్దతిలో వెళుతున్నారు. నోటికొచ్చిట్లు అధికారులను తిట్టేయటం, కేసు నమోదైతే మాయమైపోయిన కోర్టులో ముందస్తు బెయిల్ తచ్చేసుకోవటం ఈ మాజీ మంత్రికి మామూలైపోయింది.
మరి తాజాగా ఆర్డోవో, ఎంఆర్వోలను బూతులు తిట్టిన ఘటనలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే. విచిత్రమేమిటంటే అధికారులను బూతులు తిట్టిన అయ్యన్నను టీడీపీ నేతలంతా వెనకేసుకొసుకు రావటం. ఎందుకంటే మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ లాంటి వాళ్ళు కూడా ఇదే పద్దతిలో ఉంటారు. నోటికొచ్చినట్లు తిట్టేయటం, యాక్షన్ తీసుకుంటే కక్షసాధింపులకు దిగుతోందంటూ ప్రభత్వంపై ఎదురుదాడులకు దిగటం అందరు చూస్తున్నదే. మరి అయ్యన్నపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలకు దిగుతుందో చూడాల్సిందే.