ఏపీ మంత్రి అవంతికి కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. సోమవారం కూడా అదే జోరు కొనసాగింది.
ఏపీలో వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఏపీలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆయన కుమారుడు శివసాయికి కరోనా పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వాళ్లిద్దరూ హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
కాగా తనను కలిసేందుకు కార్యాలయానికి ఎవరూ రావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. అలాగే ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
మొత్తం ఏపీలో కరోనా విస్తృతి మాత్రం తగ్గడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో అయితే విపరీతంగా ఉంది. ఏపీలోని మొత్తం కేసులు.. విదేశాల్లోని ఒక్క చిన్న దేశంలో నమోదైన కేసులతో సమానంగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.