'స్కిల్‌' కేసులో దూకుడు పెంచిన సీఐడీ.. పీవీ ర‌మేష్ అరెస్టుకు రంగం సిద్ధం!

Update: 2021-12-21 08:28 GMT
చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాం లో ప్రారంభించిన రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ‌ కు చెందిన నిధులు దారి మళ్లించార‌నే అంశం పై.. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వం సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మం లో మాజీ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ ఇంట్లో సీఐడీ అధికారులు ముమ్మ‌రంగా సోదాలు చేయ‌డం.. ఆయన‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. ఇంత‌లో ఆయ‌న కోర్టుకు వెళ్లి ర‌క్ష‌ణ పొంద‌డం తెలిసిందే. ఇక, ఇదే కేసులో ఇప్ప‌టికే గంటా సుబ్బారావును అరెస్టు చేయ‌డం..ఆ య‌న‌కు బెయిల్ ఇవ్వ‌డం తెలిసిందే.

అయితే.. ప్ర‌స్తుతం ఈ కేసు లో కోర్టుకు ఎక్కింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారంలో కొందరి పైనే కేసులు నమోదు చేయడం పై సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. రెండు నెలల విచారణ లో ఏం తేల్చారని అడిగింది. అంతే కాదు, బాధ్యులుగా ఉన్న వారి పైనా కేసులు పెట్టాల‌ని కోర్టు ఆదేశించింది.

దీంతో అప్ప‌టి చైర్మ‌న్ ప్రేమ్ చంద్రారెడ్డి పైనా నోటీసులు ఇచ్చిన‌ట్టు కోర్టుకు తెలిపారు.అయితే.. ఇప్పుడు కోర్టు ఆదేశాల‌ తో మ‌రింత దూకుడు పెంచిన సీఐడీ.. గ‌తంలో జ‌గ‌న్‌కు స‌ల‌హాదారుగా ప‌ని చేసిన మాజీ ఐఏఎస్ పీవీ ర‌మేష్‌ను టార్గెట్ చేశారు.

మాజీ ఐఏఎస్ పీవీ రమేష్‌ ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిసింది. హైదరాబాద్‌ లోని ఆయన నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. రమేష్ అందుబాటు లో లేకపోవడం తో వెనుదిరిగారు. ఒక కంపెనీ‌కి రూ.350 కోట్లు విడుదల చేయడం వెనుక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణంలో విచారించనున్నా రు.

అప్పట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి‌గా రమేష్ పని చేశారు. ఒకవేళ ఈ కేసు‌లో రమేష్‌ను సాక్షి‌గా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పలువురు అధికారులను కూడా ఏపీ సీఐడీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్ప‌టికే ఏ3గా నిమ్మ‌గ‌డ్డ వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్‌ను కూడా ప్ర‌శ్నించాల‌ని భావించారు.

అయితే.. ఆయ‌న‌ను అరెస్టు చేయొద్ద‌ని.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా.. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ అవినీతి వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. చివ‌ర‌కు ఎక్క‌డ ఆగుతుందో చూడాలి.

ఇదిలా వుంటే.. పీవీ ర‌మేష్‌.. సీఎం జ‌గ‌న్‌ కు స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఆయ‌న టీడీపీ కి కోవ‌ర్టుగా వ్య‌వ‌హరించార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌కు ఉన్న స‌బ్జెక్టుల‌ను త‌గ్గించారు. దీంతో పీవీ ర‌మేషే త‌నంత‌ట త‌ను.. రాజీనామా చేసి వెళ్లిపోయారు. తర్వాత కాలంలో చ‌లం స‌హా.. శ్రీశ్రీ ర‌చ‌న‌ల‌ను కోట్ చేస్తూ.. జ‌గ‌న్ పాల‌న‌ పై విమ‌ర్శ‌లు సంధించి.. లైమ్‌ లైట్‌ లో నిలిచిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News