గ్రేటర్ పోరు : మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి !
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ నత్తనడకన సాగుతుంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారాన్ని జరిపి, తమదే గెలుపు అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ సమయంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ,పోలింగ్ ప్రారంభమైన తర్వాత అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ లో పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుండి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా కూకట్‌పల్లి ఫోరం మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో టీఆర్ ఎస్ కార్యకర్తలు.. కారులో వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బుతో దొరికితే కారును సీజ్ చేయకుండా పోలీసులు వదిలిపెట్టారని ఆరోపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. మంత్రి కాన్వాయ్ ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే ఈ గొడవ జరిగిన సమయంలో కార్ లో మంత్రి పువ్వాడ అజయ్ లేనట్లు సమాచారం. టీఆర్ ఎస్, బీజేపీ గొడవతో కూకట్‌పల్లిలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇకపోతే మధ్యాహ్నం ఒంటిగంట దాకా కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది