మెడపై కూర్చొని.. తలను మెలికపెట్టి..: అమెరికాలో భారతీయ విద్యార్థిపై దాడి

Update: 2022-05-17 06:08 GMT
అమెరికాలో జాతి అహంకార దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకున్న శ్వేతీయులు ఇప్పుడు భారత సంతతి వ్యక్తులపై విరుచుకుపడుతున్నారు. చిన్న చిన్న కారణాలతోనే భారత సంతతికి చెందిన విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. అయితే ఇలాంటి దాడుల్లో స్థానిక సంస్థలు తమ వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. తమవారంతా మంచివారే అన్నట్లుగా వ్యవహరిస్తూ విదేశీయులపై చిన్నచూపు చూస్తున్నాయి. తాజాగా ఓ భారత సంతతికి చెందిన విద్యార్థిపై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విషయంలోనూ స్కూల్ ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై ఇండియన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కాపెల్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో భారత విద్యార్థి చదువుతున్నాడు. ఇటీవల స్కూల్ మధ్యలో భోజనం చేసేందుకు క్యాంటిన్ కు వెళ్లాడు. అయితే అక్కడికి ఓ అమెరికన్ విద్యార్థి వచ్చి భారతీయ విద్యార్థిని లేచి వేరే దగ్గర కూర్చోవాలని అన్నాడు. కానీ ఎవరూ లేని సమయంలో తాను కూర్చున్నానని, తాను అక్కడి నుంచి వెళ్లనని అన్నాడు. కానీ అమెరికన్ విద్యార్థిని దబాయించాడు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లాలని ఇబ్బంది పెట్టాడు.

అక్కడున్న భారతీయ విద్యార్థికి చెందిన స్కూల్ బ్యాగ్ ను తీసి పక్కకు పడేశాడు. అంతేకాకుండా అవమానకరంగా ప్రవర్తించాడు. తన వేలితో ఆ విద్యార్థి మెడపై పొడుస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. ఐనప్పటికీ భారతీయ విద్యార్థి అక్కడి నుంచి కదలలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన అమెరికన్ విద్యార్థి పైకి లేచి భారతీయ విద్యార్థి మెడపై కూర్చున్నాడు. తలను మెలిక పెట్టి కుర్చీకేసి కొట్టాడు. తలపై ఉన్న వెంట్రుకలను అటూ ఇటూ తిప్పుతూ భారతీయ విద్యార్థిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.

ఇదంతా అక్కడున్న విద్యార్థులు చూస్తున్నారే తప్పా.. ఎవరూ వారి వద్దకు రాలేదు. అంతేకాకుండా అక్కడ భారతీయ మూలాలన్న విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.

పైగా సినిమా చూస్తున్నట్లు ప్రవర్తించారు. ఇక కొందరైతే అమెరికన్ విద్యార్థిని రెచ్చగొట్టారు. ఈ క్రమంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందించారు. అయితే ప్రిన్సిపాల్ సైతం సొంత దేశ విద్యార్థికే మద్దతు పలికాడు. ఈ సంఘటనకు భారతీయ విద్యార్థే కారణమని భావిస్తూ ఆయనను మూడు రోజులు సస్పెండ్ చేశారు. అమెరికన్ విద్యార్థికి మాత్రం ఒక్కరోజు సస్పెండ్ తో సరిపెట్టారు.
4

గత కొన్ని నెలలుగా అమెరికాలో వరుసగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ నిచ్చే అమెరికాలో ఇలాంటి దాడులు సాగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో నల్ల జాతీయులపై జరిగిన దాడులపై ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలియంది కాదు. ఇప్పుడు శ్వేతీయులు ఇండియన్స్ ను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News