వాజ్ పేయి వర్థంతి.. మోడీ, రాష్ట్రపతి నివాళి
దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెసేతర ప్రధానుల్లో మొదటివాడు అటల్ బిహారీ వాజ్ పేయి. ఆ తర్వాత ఇప్పుడు నరేంద్రమోడీ వచ్చాడు. బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతుందంటే అదంతా వాజ్ పేయి చలువే. ఆయన ప్రధానిగా దేశానికి మూడు సార్లు సేవలందించాడు. అటల్ జీవితంలోని ప్రతీ అంశమూ స్ఫూర్తిదాయకమే.
అందుకే బీజేపీని నిలబెట్టిన వాజ్ పేయి వర్థంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ఈ వీడియోలో ఆయనకు నివాళులర్పించారు. ‘అటల్ జీ చేసిన మంచిని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆయన నేతృత్వంలోనే భారత్ అణు పరీక్షలు జరిపింది. ఎదిగింది. మౌనాన్ని కూడా ఆయుధంగా వాడిన ధీశాలి అటల్. వాజ్ పేయి వర్థంతి సందర్భంగా ఆయనకు ఇదే నా శ్రద్ధాంజలి’ అంటూ ప్రధాని వీడియోను ట్వీట్ చేసి పొగిడారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రెండో వర్థంతి సందర్భంగా ఆదివారం యావత్ జాతి ఆయనకు ఘన నివాళులర్పించింది. ఢిల్లీలోని ఆయన స్మారక స్థలి ‘సదైవ్ అటల్ ’ వద్ద భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్ర పెద్దలంతా పుష్పాంజలి ఘటించారు.
ఇక అటల్ సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. ఈ తరంలో ఉదార ప్రజాస్వామికవాదిగా వాజ్ పేయి గుర్తుండిపోతారని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు.
వాజ్ పేయి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో డిసెంబర్ 25, 1924లో జన్మించారు. బీజేపీ తరుఫున ఎన్నికైన తొలి ప్రధాని. మూడు సార్లు దేశానికి ప్రధానిగా చేశారు. 93 ఏళ్ల వయసులో 2019 ఆగస్టు 16న కన్నుమూశారు.