'ఆస్ట్రాజెనెకా' సమర్థవంతంగా పని చేస్తుందట : లాన్సెట్ నివేదిక
యూకే ప్రభుత్వం తోలి కరోనా వ్యాక్సిన్ కి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా యూకే ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ భాగస్వామ్యంలో అభివృద్ధి చేందుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. డోసేజ్ ప్రకారం ఇది 62 శాతం, 70 శాతం, 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.
తమ ఫేస్ 3 డాటాని పలువురు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు పరిశీలించారని, మొత్తం మీద తమ వ్యాక్సిన్ 70.4శాతం సామార్థ్యం కలిగి ఉన్నట్లు సైంటిస్ట్‌ల బృందం వెల్లడించదని చెప్పారు. దాదాపు 20 వేల మందికి పైగా అధునాతన పరీక్షల పూర్తి ఫలితాలను పరిశీలించిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం, అనుమతులు జారీ చేయడం వంటి కీలక అంశాలన్ని ఈ డాటా మీదనే ఆధారపడతాయన్నారు.
అంతేకాక తమ ఫేజ్ 3 డాటాను స్టడీ చేసి లాన్సెట్ ఓ నివేదక విడుదల చేసిందని.. దాని ప్రకారం ఆస్ట్రాజెనెకా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్, ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ మాట్లాడుతూ.. ఈ రోజు మేం ఫేజ్ 3 ట్రయల్ డాటా తాత్కాలిక విశ్లేషణలను ప్రచురించాము. ఈ కొత్త వ్యాక్సిన్ మంచి సేఫ్టీ రికార్డ్, కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పని చేయగల సామార్థ్యం కలిగి ఉన్నట్లు ఈ విశ్లేషణలు వెల్లడించాయని అన్నారు. ఈ ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్ తీవ్రం కావడం లేదు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రావడం వంటి పరిస్థితులు తలెత్తడం లేదు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితం, బాగా తట్టుకోగలదు అని నిరూపితమయ్యింది అని లాన్సెట్ వెల్లడించింది. భద్రత పరంగా, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒక తీవ్రమైన ప్రతికూల సంఘటన ఉంది మరియు మరొకటి అధిక ఉష్ణోగ్రత ఇప్పటికీ పరిశోధించబడుతోంది.