ఆస్తమా పేషేంట్స్ కి ,స్మోకింగ్ చేసేవారికి వైరస్ ప్రభావం తక్కువేనట !

Update: 2020-12-02 23:30 GMT
కరోనా  మహమ్మారి  గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కరోనా ను నిర్ములించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాలు  చివరి దశలో ఉన్నాయి. అయితే , ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవచ్చు అన్న   ఊహాగానాలతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైరస్ గురించి మరో విస్తుగొలిపే మరో విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ కరోనా వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీనితో ఆస్తామా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని  వైద్యులు చెప్తున్నారు. అయితే , తాజాగా ఓ అధ్యయనం మాత్రం ఆస్తామా రోగులకు కరోనా వైరస్ ప్రబలే అవకాశం చాలా తక్కువ అని తెలిపింది.  

ఈ విషయాన్ని చెప్పే ముందే  .. తాము ఆస్తామా ఉన్న రోగులను పరిశీలించామని అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ గతనెల 24వ తేదీన ప్రచురించిన జర్నల్‌ లో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి మరింత అధ్యయనం చేయాల్సి ఉంది అని తెలిపింది. ఆస్తమా ఉన్న రోగులను పరిశీలించారు. ఇజ్రాయెల్‌‌ ఆరోగ్య నిర్వహణ సంస్థ నుంచి డేటా తీసుకున్నారు. ఫిబ్రవరి 2020 నుంచి జూన్ వరకు కరోనా వైరస్ టెస్ట్ చేసిన వారిని అధ్యయనం చేశామని వివరించారు. 37 వేల 469 మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేశారు. వీరిలో 2 వేల 266 అంటే 6.05 శాతం మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారు 153 ఆస్తమా రోగులు ఉంటే 3 వేల 388 మందికి నెగిటివ్ వచ్చింది. దీని బట్టి ఆస్తమా ఉన్నవారిలో ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు అని ఆ అధ్యయనం వెల్లడించింది. అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కంటే, నెగిటివ్ వచ్చిన వారు ఎక్కువ స్మోకింగ్ చేస్తారనే విషయం తెలిసింది. అంతేకాదు సిగరేట్ తాగేవారిలో కూడా వైరస్ సోకదని దీనిని బట్టి తెలుస్తోంది. అయితే ఆస్తమా భాదితులకు కరోనా ప్రభావం ఉండదు అని ఇష్టానుసారం తిరిగితే వైరస్ భారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి .. ఏదేమైనా కరోనా నియమాలు పాటిస్తూ మరికొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిందే.
Tags:    

Similar News