ఎట్టకేలకు తెలుగు మీడియా సంస్థకు అసద్ ఇంటర్వ్యూ ఇచ్చారుగా
తెలుగు నేల మీద రాజకీయాలు చేస్తూ.. తెలుగు మీడియాను ఏ మాత్రం పట్టించుకోని రాజకీయ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీనే. హైదరాబాద్ కేంద్రంగా నడిచే తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారన్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్నేళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ సత్తా చాటుతున్న మజ్లిస్.. ఇటీవల బిహార్ లో జరిగిన ఎన్నికల్లో ఏడుఅసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. సాధారణంగా తాము ఉండే ప్రాంతానికి చెందిన మీడియా సంస్థలకు రాజకీయ అధినేతలు దగ్గరగా ఉంటారు. కానీ.. అసద్ మాత్రం అందుకు భిన్నమని చెబుతారు.
జాతీయ మీడియా సంస్థలకు దగ్గరగా ఉండే అసద్.. తెలుగు మీడయాను.. మీడియా ప్రతినిధుల్ని పెద్దగా పట్టించుకోరని చెబుతారు. ఎప్పుడైనా ప్రత్యేక ఇంటర్వ్యూ అడిగితే.. ఏదో సాకు చెబుతారే కానీ.. ఇవ్వటానికి ఆసక్తి చూపించరు. దీంతో.. విసిగిపోయిన మీడియా ప్రతినిధులు ఆయన ఇంటర్వ్యూ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించరు. చాలా రోజుల తర్వాత తెలుగు మీడియా సంస్థ ఒకటి అసద్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆ మాటకు వస్తే.. అసద్ ను ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఒప్పించారని చెప్పాలి. ఈసారి జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు గతానికి భిన్నంగా సాగుతున్న నేపథ్యంలో.. తన గొంతు తెలుగు ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
సదరు ఇంటర్వ్యూలో అసద్ చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- దేశమంతా ఎంఐఎం బలమైన పార్టీగా అవతరిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టింది. బిహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు సాధించింది. ఇద్దరమే ఎంపీలున్నప్పటికీ.. 200 మంది ఎంపీలున్న స్థాయిలో పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.
- వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికల్లో మజ్లి్‌సను తట్టుకునే శక్తి బీజేపీకి లేదు. అందుకే హైదరాబాద్‌లో మమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఇక్కడ మజ్లిస్ పునాదులను ఎవరూ కదలించలేరు.
- ఎన్నికల్లో మజ్లి్‌సకు ప్రధాన ప్రత్యర్ధి మజ్లిసే.. కొన్నిచోట్ల బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్ధులు బలమైన పోటీ ఇస్తున్నారు. కాంగ్రె్‌సకు ఒక్క సీటూ రాదు. బీజేపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా నగర ప్రజలు సామరస్యతను కాపాడుకుంటారు.
- హిందూ-ముస్లిం సోదరభావాన్ని ఎవరూ చెడగొట్టలేరు. అధికార టీఆర్‌ఎ్‌సతో ఎలాంటి ఎన్నికల ఒప్పందాలు లేవు. ఆ అవసరం లేదు కూడా.
- హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తుంటారు. ఇలాంటి చోట విద్వేషాలకు అస్కారం లేదు. క్రమంగా బలపడుతున్న మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదు. మజ్లిస్ కు భూ కబ్జాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. చులకన చేసేందుకే ఆరోపణలు చేస్తున్నారు.
- వెనుకబడిన పాతబస్తీలో అభివృద్ధికి అధిక నిధులు రాబట్టేందుకే అధికారపక్షంతో సఖ్యతగా ఉన్నాం. సీఎం కేసీఆర్‌ను అందుకే కలిశాం. ఆయన సానుకూలంగా స్పందించారు.
- గ్రేటర్ మొత్తం డివిజన్లలో పోటీకి మాకు బలం లేదు. గెలుస్తామనుకున్న సీట్లలోనే పోటీ చేస్తున్నాం. మిగిలిన డివిజన్లలో ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాలని పార్టీ యంత్రాగానికి చెప్పాం.
- డిసెంబరు ఒకటిన పాతబస్తీ ప్రజలు బీజేపీపై ఓటు ద్వారా డెమోక్రటిక్ స్ట్రైక్ చేస్తారు. పాతబస్తీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపాలని లేఖ ఇవ్వమని అమిత్ షా నన్ను అడుగుతున్నారు. ఒక కేంద్రమంత్రి తన విధులు నిర్వర్తించేందుకు ఎంపీ సిఫార్సు లేఖ అడగటం చరిత్రలో తొలిసారి.