• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మళ్లీ డ్రగ్స్ కేసులో...

మళ్లీ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఆఫీసుకు ఆర్యన్ ఖాన్

By - Tupaki Desk
Update: 2021-11-05 09:32 GMT
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరయ్యాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడి దాదాపు 27 రోజులు జైల్లో ఉన్నాడు ఆర్యన్. ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. బెయిల్ నిబంధనల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలలోపు హాజరుకావాల్సి ఉండడంతో ఆర్యన్ ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నాడు.

కండీషన్ బెయిల్ నేపథ్యంలోనే ఆర్యన్ మరోసారి ఎన్సీబీ కార్యాలయానికి రావాల్సి వచ్చింది. ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు హాజరు కావాలని ఆర్యన్ ఖాన్ కు షరతులు విధిస్తూ ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ ఈరోజు ఎన్సీబీ ఎదుట హాజరయ్యాడు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై విడుదలై ఊపిరి పీల్చుకున్నాడు. దాదాపు 27 రోజులకు పైగా అతడు డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడి ఎన్సీబీ ఆరోపణలో ఆర్యన్ కు బెయిల్ దక్కలేదు. సుప్రీంకోర్టు దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్ గీ ఎట్టకేలకు బలమైన వాదన వినిపించి బెయిల్ ఇప్పించారు.

ఆర్యన్ ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారుల తరుఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఇప్పుడు ఈ ఆరోపణలపైనే విచారణ జరుగుతోంది.


Tags:    
  • Aryan Khan 
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS