దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులు ఎవరు మాట్లాడరేం?

Update: 2020-08-24 06:00 GMT
లాక్ డౌన్ విధించే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో సర్వీసుల్ని బంద్ చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత ఆన్ లాక్ ప్రక్రియలు మొదలైనప్పటికీ.. మెట్రో సర్వీసులకు మాత్రం కేంద్రం ఓకే చెప్పలేదు. దీంతో.. మహానగరాల్లో సామాన్యలు ఇబ్బందులకుగురవుతున్నారు. ప్రమాదకరమైన కరోనాతో సహజీవనం తప్పించి మరో మార్గం లేదని చెబుతున్న పాలకులు.. ఒక్కొక్క పరిమితుల్ని ఎత్తేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా షూటింగ్ లు నిర్వహించుకోవటానికి అంగీకారాన్ని తెలిపిన కేంద్రం..కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా గళం విప్పారు. ఢిల్లీలో మెట్రో రైలు సేవల్ని పునరుద్దరించే అంశాన్ని కేంద్రం పరిశీలించాల్సిందిగా కోరారు. మెట్రో రైళ్లను తిరిగి నడిపేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇతర నగరాల్లో మెట్రో సర్వీసుల్ని పునరుద్ధరించకున్నా.. ఢిల్లీలో మాత్రం ప్రయోగాత్మకంగా నడపాలని కోరుతున్నారు.

కేజ్రీవాల్ మాటల్నే తీసుకుంటే.. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్ లో పరిస్థితి మరింత మెరుగ్గా ఉంది. అలాంటప్పుడు.. ఏ ప్రాంతంలో అయితే.. కేసుల నమోదు తక్కువగా ఉంటే.. అక్కడ మెట్రో సర్వీసుల్ని తిరిగి స్టార్ట్ చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇలాంటి నిర్ణయాల్ని కేంద్రం తీసుకోవాలంటే.. ఆయా రాష్ట్రాల చొరవ చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.

గతంతో పోలిస్తే.. హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గాయి. అలాంటివేళలో.. మెట్రో సర్వీసుల్ని పునరుద్ధరించటం మంచిది. అయితే.. ఇప్పటివరకు తెలంగాణ సర్కారు ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించలేదన్న మాట వినిపిస్తోంది. కీలక అంశాల విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వచ్చి గళం విప్పినప్పుడు.. ఆయనకు జతగా మిగిలిన సీఎంలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఢిల్లీ సీఎం తన పని తాను చేయగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా.. మిగిలిన సీఎంలు తమకేమీ పట్టనట్లుగా ఉండటం గమనార్హం.
Tags:    

Similar News