• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం వేసిన పంచ్ మామూలుగా...

సీఎం వేసిన పంచ్ మామూలుగా లేదు

By - Tupaki Desk
Update: 2016-08-21 08:40 GMT
ప్ర‌ఖ్యాత ద్యాన విధాన‌మైన విపాసన అభ్యాసం పూర్తయిన తర్వాత మౌనంగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలకు పదును పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అంబానీలను దాసోహం అయితే... ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్రభుత్వం అదానీలకు దోచిపెడుతోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అంబానీల జేబులో ఉంటే..మోడీ అదానీల సేవలో తరిస్తున్నారని అన్నారు. గడిచిన మూడేండ్లలో అదానీ రాబడి మూడింతలు అయినట్టు వార్తలొచ్చాయని కేజ్రివాల్ ఆరోపించారు. సామాన్యుల ఆదాయం పెరిగితే పప్పుధాన్యాలు - ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేస్తారని - అదే సొమ్ము అదానీ జేబులోకి వెళితే ఆయన తన భార్యకు హెలికాఫ్టర్‌ కొనిస్తారని వ్యాఖ్యానించారు. 'మోడీజీ అదానీకి చేసిన సేవలు చాలు ఇక ప్రజల కోసం పనిచేయండని' ప్రధానిని ఉద్దేశించి అన్నారు.

ఇదిలాఉండ‌గా సామాన్యుల‌కు ఉప‌యుక్త‌మైన మ‌రో నిర్ణ‌యాన్ని   సీఎం అరవింద్‌ కేజ్రీవాల్  తీసుకున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మద్యం షాపుల పరిధిలో ఉన్న స్థానికుల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడిపితే అట్టి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నదని ఆప్ మాజీ నాయ‌కులు - స్వరాజ్‌ అభియాన్‌ నేతలు ప్రశాంత్‌ భూషణ్‌ - యోగేంద్ర యాదవ్‌ లు గతవారం విమర్శించారు. నివాస ప్రాంతాల్లో ఉన్న లిక్కర్‌ షాపులను వెంటనే మూసివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో కేజ్రీ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.
Tags:    
  • Arvind Kejriwal 
  • Adani 
  • Telugu NEWs 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS