కమల్ హాసన్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ప్రధాన కార్యదర్శి

Update: 2020-12-25 13:14 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు.. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కమల్ తర్వాత పార్టీకి పెద్ద దిక్కు.. ఎంఎన్ఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం తాజాగా కమల్ కు షాకిచ్చాడు. ఇవాళ పార్టీని వీడి బీజేపీలో చేరడం సంచలనమైంది.

కమల్ హాసన్ రెండో దశ ప్రచారంలో బిజీగా ఉన్న వేళ అరుణాచలం పార్టీని వీడి బీజేపీలో చేరడం గమనార్హం. చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో అరుణాచలం పార్టీ కండువా కప్పుకున్నారు.

రైతులకు ఉపయోగపడే బీజేపీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతివ్వాలని తాను కమల్ ను కోరానని.. అయితే వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా అరుణాచలం విమర్శించారు. అందుకే బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

కమల్ పార్టీలో అరుణాచలం కీలక నేత. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి కమల్ కు గట్టి షాకిచ్చారు. అరుణాచలం వైదొలడం కమల్ కు గట్టి ఎదురుదెబ్బగా పేర్కొంటున్నారు.
Tags:    

Similar News