ఇద్దరు బీజేపీ పెద్దలకు కేన్సర్ - స్వైన్ ఫ్లూ

Update: 2019-01-17 05:00 GMT
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కాలం కలిసిరావడం లేదు. ఆయనకు మొన్నీ మధ్యనే మూత్రపిండాలు చెడిపోతే మార్పిడి చేశారు. వాటితో ఆయన కోలుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఉపద్రవం ఇంకా చల్లారకముందే.. తాజాగా కేన్సర్ సోకింది. 66 ఏళ్ల అరుణ్ జైట్లీకి మృదుకణజాల కేన్సర్ అని తేలడంతో రెండు వారాల పాటు సెలవు పెట్టి వ్యక్తిగత సెలవుపై అమెరికా బయలు దేరారు.

న్యూయార్స్ లో ఆయన కేన్సర్ కు చికిత్స చేయించుకోనున్నారు. అయితే ఇక్కడే సమస్య ఉందని వైద్యులు సూచిస్తున్నారట.. కేన్సర్ ను గుర్తించి ఆపరేషన్ చేస్తే ఆయన మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడి ప్రాణాలకే ప్రమాదమట.. అందుకే ఆపరేషన్ చేయలేమంటున్నారు. కీమో థెరపీ ఆయన బాడీ సహకరించదని వైద్యులు తేల్చారు. దీంతో మందులతోనే తగ్గించాల్సిన పరిస్థితి. అయితే మందుల వల్ల మృదుకణజాల కేన్సర్ లొంగే అవకాశాలు లేవట.. శరీరం మొత్తం వేగంగా వ్యాపించే వ్యాధి కావడంతోనే ఆయన అమెరికాలో అత్యున్నత వైద్య సంస్థకు బయలు దేరారు. బీజేపీలోనే అత్యంత ధనవంతుడైన నేతగా పేరొందిన అరుణ్ జైట్లీ ఈ వ్యాధి రావడంపై ప్రధాని మోడీ - ప్రతిపక్ష నేత రాహుల్ అంతా అంతా సానుభూతి తెలిపారు.

కాగా ఇటీవల చలిలో పర్యటనలు పెట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకింది. ఛాతీ - శ్వాస సంబంధ సమస్యలతో బుధవారం రాత్రి 9 గంటలకు ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో అత్యవసరంగా చేరారు. తనకు స్వైన్ ఫ్లూ సోకిందని.. ప్రజల ఆశీర్వాదంతో కోలుకుంటానని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.

కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ముక్కుకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఇలా బీజేపీ నేతల ఆనారోగ్య పరిస్థితులు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి.



Full View

Tags:    

Similar News