3 రోజుల్లో ఏడు ఖండాలు తిరిగింది..! అరబ్​ మహిళ రికార్డ్​

Update: 2020-11-23 23:30 GMT
సాహసం చేయరా డింబకా, సాహసవీరుడు, జగదేకవీరుడు ఇలా ప్రపంచచరిత్రలో మహావీరులు అంటూ మగవాళ్లనే కీర్తిస్తుంటారు. పురుషాధిక్య సమాజంలో ఇది కామనే..! ఇప్పటి వరకు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన వాళ్లు.. చంద్రమండలంపై కాలు మోపినవాళ్లు కూడా ఎక్కువశాతం మగవాళ్లే ఉంటారు. పురుషాధిక్యత  సమాజంలో అనాధిగా వస్తున్న ఓ ఆధిపత్యభావజాలపు ప్రతీక. కానీ ఓ మహిళ.. అది కూడా స్త్రీలకు అత్యంత కట్టుబాట్లతో ఉంచే మతంలో, స్త్రీలకు ఎన్నో ఆంక్షలు విధించే దేశంలో పుట్టిన ఓ వనిత.. ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది.

కేవలం 3 రోజుల్లోనే ఏడుఖండాలు తిరిగి గిన్నిస్​బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటుసంపాదించుకొని స్త్రీల గౌరవాన్ని పెంచింది. నవంబర్‌ 18, 2020న ఆమె పేరు గిన్నిస్​ రికార్డ్స్ లోకి ఎక్కింది.  అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్‌ ఖాలా అల్‌రొమైతీ ఈ ఘనతను సాధించారు. ఆమె ఈ ఏడు ఫిబ్రవరిలో  ఈ సాహసయాత్ర చేయగా.. ఇప్పుడు గిన్నిస్​ బుక్​ఆఫ్​ రికార్డు ఈమె పేరును, నెలకొల్పిన రికార్డ్​ను నమోదు చేసుకున్నది.


గతంలో అమెరికన్‌ నటి జూలీ బెర్రీ  92 గంటల్లో ఈ రికార్డ్‌ సాధించారు. కాగా అల్‌రొమైతీ ఈ రికార్డ్​ను అధిగమించారు. డాక్టర్‌ ఖాలా అరబ్‌ ఎమిరేట్స్‌కు వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

ఆమె ఈ విజయంపై ఏమన్నారంటే.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు 2020 సంవత్సరానికి ‘డిస్కవర్‌ యువర్‌ వరల్డ్‌’ అనే థీమ్‌ ఇచ్చారు. అది ఒక స్ఫూర్తినిచ్చింది నాకు. దుబాయ్​లో అన్ని దేశాలవారు ఉంటారు. వారందరూ ఇక్కడికి రావడం వల్లే మా దేశం ఎంతో కళకళలాడుతోంది. అందుకని వారికి కృతజ్ఞతగా కూడా వారున్న దేశాలను, ఖండాలను చుట్టి రావాలని అనుకున్నా’ అని అన్నారు ఖాలా.ఫిబ్రవరి 13, 2020న సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఆమె టూర్​ముగిసింది. అంటే అంతకు నాలుగు రోజుల ముందు ఆమె దుబాయ్‌ నుంచి బయలుదేరిందన్న మాట. ఏడు ఖండాలను తాకి ఆస్ట్రేలియాలో యాత్ర ముగించడానికి ఆమె తీసుకున్న సమయం 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లు.
Tags:    

Similar News