• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పరీక్షల రీషెడ్యూల్ పై...

పరీక్షల రీషెడ్యూల్ పై నోరు మెదపని ఏపీపీఎస్సీ!

By - Tupaki Desk
Update: 2019-10-25 11:01 GMT
ఏపీపీఎస్సీ ఒక రాజ్యాంగ బద్దమైన స్వతంత్ర్య వ్యవస్థ. దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం, ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదు. ఈ ఆయాచిత అధికారమే ఆ సంస్థ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన సభ్యుల అండతో  ఏపీపీఎస్సీ లో నిర్లక్ష్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

ఇటీవల జరిగిన గ్రామ సచివాలయ, వార్డు పరీక్షల లీకేజీ వ్యవహారంలో కూడా ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎపీపీఎస్సీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలిసింది. త్వరలో జరగాల్సిన  మెయిన్స్ పరీక్షల ప్రశ్న పత్రాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. లీకేజీ భయంతోనే ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2018లో విడుదలైన పలు నోటిఫికేషన్లకు పరీక్షల ప్రశ్నపత్రాల సెట్టింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రం ఉదంతం బయటకు రావడంతో ఇప్పుడు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడమా.? వాయిదా వేయడమా? రీషెడ్యూల్ చేయడమా అన్నది ఏపీపీఎస్సీ నిర్ణయించలేకపోతోంది. కమిషన్ కు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భర్తీ సవ్యంగా జరగడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. సిబ్బంది అక్రమాల వల్లే ఇలా లీకులు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఏపీపీఎస్సీ వ్యవహారశైలి కారణంగా పలువురు అభ్యర్థులు కోర్టుకు ఎక్కుతున్నారు. ఉద్యోగాలకు విద్యార్హత విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ తప్పులు, ఒప్పులపై ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం చేసినా వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ వ్యవహారశైలి..అందులో పనిచేసే సిబ్బంది చేసే ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల  అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో నెలకొంది. ఇప్పటికైనా ఏపీపీఎస్సీ  పనితీరు మార్చుకోవాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది.
Tags:    
  • APPSC recruitment 
  • APPSC recruitment exam calendar 2020 
  • Telugu News 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS