ఏపీలో యాపిల్ ఫోన్ల తయారీ..

Update: 2017-04-26 06:06 GMT
ఏపీని స్మార్టు ఫోన్ల తయారీ కేంద్రంగా మారుస్తామంటున్నా సీఎం చంద్రబాబు. ఏకంగా సొంత జిల్లా చిత్తూరులో యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా అలాంటి ప్రతిష్ఠాత్మక కర్మాగారం వస్తే మాత్రం రాష్ట్రానికి మంచిదే. యాపిల్ ఫోన్లంటే ఇంటర్నేషనల్ గా విపరీతమైన  క్రేజ్. అలాంటి సంస్థ ఇండియాలో కొత్తగా తయారీ యూనిట్ పెట్టబోతున్నప్పుడు ఏపీని ఎంతవరకు ప్రిఫర్ చేస్తుందన్నది చూడాలి. అయితే... కొత్త రాష్ట్రం  కావడంతో .. రాయితీలు వంటివి బాగా ఆఫర్ చేస్తే మాత్రం యాపిల్ ప్రొడక్షన్ యూనిట్ మనకు వచ్చినట్లే.
    
చిత్తూరులో ఇది ఏర్పాటు చేసేలా ప్రభుత్వం వైపు నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు.  యాపిల్ పరిశ్రమ ఏర్పాటైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నది ఆయన మాట.  కంప్యూటర్లు - సెల్‌ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల (హార్డ్‌ వేర్) తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు.
    
కాగా ఏపీలో ఇప్పటికే మొబైల్ ఫోన్ల తయారీ మొదలైంది.  అంతర్జాతీయంగా పేరున్న తైవాన్ సంస్థ ఫ్యాక్స్ కాన్ ఇక్కడ స్మార్టు హ్యాండ్ సెట్లను తయారీ ఏడాదిన్నర కిందటే ప్రారంభించింది.  షియామీ మొబైల్ ఫోన్లు ఇక్కడ తయారవుతున్నాయి.  ఫాక్స్ కాన్ సంస్థ నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఈ మొబైల్ ను ఉత్పత్తి కేంద్రం నెలకొల్పింది.  ఇప్పుడు ఆ పక్కనే చిత్తూరు జిల్లాలో యాపిల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం స్మార్టుఫోన్ల హబ్ గా మారడం గ్యారంటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News