భక్తి పాటలకు మాజీ మంత్రి చిందులు..
ప్రస్తుతం రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉండి ప్రశాంత జీవితం పొందుతున్నారు మాజీమంత్రి రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన రఘువీరారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో కీలక స్థాయికి చేరుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి కాంగ్రెస్ చేరడంతో ఆయన రాజకీయంగా సైలెంటయ్యారు. ఇతరుల మాదిరి వేరే పార్టీలోకి జంప్ కాకుండా నమ్ముకున్న పార్టీలోనే ఉంటున్నారు. ఇంతకుముందు వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన రఘువీరారెడ్డి ఇటీవల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఇన్నాళ్లు రాజకీయంగా బిజీగా గడిపిన ఆయన ఇటీవల సరదాగా తన జీవితం గడుపుతున్నారు. ఇటీవల బావిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు. పొలాల్లో పని చేస్తూ ఆహ్లాదకరమైన జీవితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆయన భక్తి కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తి పాటలకు డ్యాన్స్ చేశారు. తోటి భక్తులతో కలిసి ఆయన ఉత్సాహంగా నృత్యం చేశారు. మడకశిరలో జరిగిన శ్రీపతాంజలి యోగా శిక్షణ సమితి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని డ్యాన్స్ చేశారు.
గతంలో కూడా రఘువీరారెడ్డి ఆటలు ఆడుతూ సరదాగా గడిపారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో క్షీణ దశకు చేరుకోవడంతో ఆయన రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉన్నారు. ఇప్పుడు కుటుంబసభ్యులతో తనకు నచ్చిన విధంగా జీవిస్తున్నారు.