ఢిల్లీలో మండ‌లి ర‌ద్దు పంచాయితీ.. ఎవ‌రి వెర్ష‌న్ వాళ్ల‌ది!

Update: 2020-01-31 01:30 GMT
ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు పంచాయితీ ఢిల్లీని చేరింది. ఏపీ శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ నిర్ణ‌యాన్ని కేబినెట్ ఆమోదించ‌డం, ఆపై అది శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొంద‌డం.. చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక మిగిలింద‌ల్లా ఆ ర‌ద్దుకు కేంద్రం ఆమోదం తెల‌ప‌డ‌మే. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధం అయిన నేప‌థ్యంలో ఈ స‌మావేశాల్లోనే ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు బిల్లు చ‌ర్చ‌కు వ‌స్తుందా? అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతూ ఉంది.

ఈ స‌మావేశాల్లోనే ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు కేంద్రం ఓకే చెబితే.. తెలుగుదేశం పార్టీకి ఝ‌ల‌క్ అవుతుంది. అలా కాకుండా.. ఆల‌స్యం అయితే వైసీపీకి బ్రేకులు ప‌డిన‌ట్టుగా అవుతుంది. ఈ నేప‌థ్యంలో.. ఢిల్లీలో ఈ ఇరు పార్టీలూ త‌మ త‌మ లాబీయింగును షురూ చేసిన‌ట్టుగా ఉన్నాయి. మండ‌లి ర‌ద్దు ఇప్పుడ‌ప్పుడే జ‌ర‌గ‌దంటూ తెలుగుదేశం వాళ్లు అక్క‌డ ప్ర‌క‌టిస్తూ ఉన్నారు. అయితే అది ఏపీ శాస‌న‌స‌భ‌కు సంబంధించిన నిర్ణ‌యం అని దాన్ని కేంద్రం ఆమోదిస్తుంద‌ని.. వైసీపీ ఎంపీలు ధీమా వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

ఇలా ఇరు పార్టీల వాళ్లూ ఎవ‌రికి వారు త‌మ వెర్ష‌న్ వినిపిస్తూ ఉన్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ గురించి జ‌రిగిన స‌మావేశంలో కూడా ఈ ఇరు పార్టీలూ త‌మ త‌మ వెర్ష‌న్ వినిపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మండ‌లిర‌ద్దు తీర్మానాన్ని చ‌ర్చ‌కు తీసుకురావాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్ర‌య‌త్నించిన‌ట్టుగా స‌మాచారం. అయితే ఆ ప్ర‌య‌త్నాల‌కు కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభ్యంత‌రం చెప్పార‌ని తెలుగుదేశం ఎంపీలు చెబుతున్నారు. అయితే ఆ స‌మావేశం గురించి ఎవ‌రి వెర్ష‌న్ ను వారు చెబుతున్న‌ట్టుగా ఉంది. అస‌లు క‌థేమిటో ఇప్పుడ‌ప్పుడే తేలే అవ‌కాశం లేదు. మొత్తానికి ఏపీ మండ‌లి ర‌ద్దు పంచాయితీ ఢిల్లీకి చేరిన వైనం మాత్రం స్ప‌ష్టంగా అర్థం అవుతోంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.


Tags:    

Similar News