అదానీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ...అక్కడ 130 ఎకరాలు కేటాయింపు !

Update: 2020-11-24 09:30 GMT
ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ , విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు అందించింది.  పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ, నిర్మాణాలకు గాను మధురవాడలో 130 ఎకరాలు కేటాయించింది. సంబంధిత  భూమి అప్పగించిన మూడేళ్లలోపు కార్యకలాపాలు ప్రారంభిచాలని ఉత్తర్వులలో పొందుపరిచింది. ఏడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసిన ప్రభుత్వం. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కుకు 20 ఏళ్లపాటు విద్యుత్ ప్రోత్సహాకాలు కూడా ప్రకటించింది.

ఇక , డేటా సెంటరులోని విద్యుత్, సమాచార, ఐటీ పరికరాల కోసం 100 శాతం ఎస్ జీఎస్టీని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును కీలకమైన ప్రాజెక్టుగా గుర్తించి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. ఇక జాతీయ రహదారి 16కు అనుసంధానం కల్పించేలా ఇతర మౌలిక సదుపాయాలను అదానీ ఎంటర్ ప్రైజెస్ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది. ప్రాజెక్టు కోసం అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఏపీలోనే 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ ఎంటర్ ప్రైజెసుకు అనుమతినిచ్చింది.  అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయనున్న ఐటీ బిజినెస్ పార్కులో కేవలం ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.  డేటా సెంటర్‌కు ఇచ్చిన భూమిలో నివాసాలు ఉండొద్దని ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలో  రూ .70 వేల కోట్ల పెట్టుబడి పెడుతూ అదానీ డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు.  అప్పట్లో ఘనంగా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖలో గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలన్నింటినీ నిలిపివేసింది. దీనితో  శంకుస్థాపన జరిగినప్పటికీ అదానీ డేటాసెంటర్ కూడా.. వెనుకడుగు వేసింది. మరో కంపెనీతో కలిసి హైదరాబాద్‌ లో డేటా సెంటర్ పెడుతుున్నట్లుగాప్రకటించింది. అయితే ఏపీ నుండి తరలిపోతున్నట్టు మాత్రం ఎక్కడా ప్రకటించలేదు.
Tags:    

Similar News