దేశంలోనే ఏపీ 3వ స్థానం

Update: 2020-11-27 11:50 GMT
దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది. నీతి అయోగ్ తలపెట్టిన   ‘ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం’లో 66.67శాతం మార్కులతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. విద్యా, వైద్యం, వ్యవసాయం జలవనరులు, ప్రాథమిక మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితపరంగా దేశంలోని మిగతా జిల్లాల కంటే వెనుకబడిన 112 జిల్లాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నీతి అయోగ్ ఈ కార్యక్రమం చేపట్టింది.

2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ఎంత మేరకు పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి ఇటీవల అధ్యయనం చేశారు.

ఈ కార్యక్రమంలో చేరకముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికీ చత్తిస్ ఘడ్ 80శాతం, ఒడిషా 70శాతం, ఆంధ్రప్రదేశ్ 66.67శాతం, ఝార్ఖండ్ 63శాతం పురోగతి సాధించి తొలి నాలుగు స్థానాల్లో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.

ఆరోగ్యం, పోషకాహార విభాగంలో నిర్ధేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ లోని కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు దాదాపు చేరుకున్నాయి. అందుకే ఏపీకి దేశంలోనే 3వ స్థానం దక్కింది.
Tags:    

Similar News