• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ.....

ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ.. బీజేపీ వింత డిమాండ్!

By - Tupaki Desk
Update: 2021-04-28 05:30 GMT
నవ్విపోదరుగాక నాకేటి సిగ్గు అన్నట్టు రాజకీయ పక్షాలు వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు ఉన్నాయి. తనది కాకపోతే ఏమైనా చేయొచ్చని పార్టీలు భావిస్తుంటాయి. ఇప్పుడు ఏపీ బీజేపీ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోందని అంటున్నారు.

ఓపక్క మోడీ ఉండే దేశ రాజధాని ఢిల్లీ శవాల దిబ్బగా మారుతోంది. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో శవాలు శ్మశానాల్లో క్యూలో ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో అయితే లాక్ డౌన్ పెట్టేశారు. అయితే అలాంటి పరిస్థితులు లేని ఏపీలో మాత్రం హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేయడం చూసి ఇప్పుడు అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ముందు దేశాన్ని మీ రాష్ట్రాలను సరిచేసి ఏపీ పై పడండి అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ప్రపంచమంతా కోవిడ్ 19 సెకండ్ వేవ్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ముఖ్యంగా భారతదేశం చావుదెబ్బతింటోంది. బీజేపీ నాయకుల చర్యలు, చేష్టలు మాత్రం  నవ్వుల పాలవుతున్నాయన్న విమర్శ ఉంది.

మొదటి వేవ్ ను జయించిన బీజేపీ సర్కార్ రెండో వేవ్ కరోనాను నియంత్రించడంలో  విఫలమైందని ప్రతిపక్షాలు కేంద్రంలోని బిజెపిని నిందిస్తున్నాయి. ఆ తప్పును ఎలా కవర్ చేసుకోవాలో తెలియని  ఏపీలోని బిజెపి నాయకులు... ఏపీలోని ప్రభుత్వంలో తప్పును కనుగొనడానికి ప్రయత్నిస్తుండడం విశేషం. జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైనందున రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పెట్టాలని ఏపీ బిజెపి నాయకులు డిమాండ్ చేయడం విశేషం.

నైట్ కర్ఫ్యూను తుగ్లక్ నిర్ణయం అని బిజెపి సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి దశలో ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్టు కొవ్వొత్తి వెలిగించడం, వరండాలో చప్పట్లు కొట్టడం వంటి చర్యలు చేపట్టాలని విష్ణు సెలవిచ్చాడు.

కోవిడ్ 19 రోగులకు వ్యాక్సిన్.. ఆక్సిజన్ సరఫరా చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి విష్ణుకుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  వ్యాక్సిన్లను రెట్టింపు ధరకు రాష్ట్రాలకు ఇవ్వడంపై ఇప్పటికే బిజెపిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 ఎలా ఇస్తారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.  బిజెపి నాయకులు ఏదైనా మాట్లాడటానికి ముందు కనీసం కోవిడ్ 19 నిర్వహణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఒక్కసారి ఆత్మవలోకనం చేసుకోవాలని.. ఆ తర్వాత ఏపీ గురించి మాట్లాడాలని పలువురు హితవు పలుకుతున్నారు.
Tags:    
  • Ap People 
  • Bjp Leaders 
  • Corona Andhra Pradesh 
  • India 
  • Telugu News 

Similar News

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS