144 సెక్షన్ ముసుగులో పోలీసులు చేసేదేమిటో చెప్పి షాకిచ్చిన జడ్జి

Update: 2020-01-18 05:44 GMT
శాంతిభద్రతల విఘాతం పేరుతో పోలీసులు 144వ సెక్షన్ విధించినప్పుడు వారేం చేస్తారన్న విషయం సామాన్యులకు తెలియనిది కాదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసనలు.. ఆందోళనల్ని కట్టడి చేసేందుకు పోలీసులు 144వ సెక్షన్ ను అమలు చేస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతిని అక్కడే ఉంచాలని కోరుతూ గడిచిన నెలకు పైనే నిరసనలు.. ఆందోళనలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల అమరావతి ఉద్యమ నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఫోటోలుకొన్ని మీడియాలో ప్రచురితమయ్యాయి.

వీటిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. ప్రభుత్వ న్యాయవాదిని పలు ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేశాయి. గుర్తింపు కార్డు ఉంటేనే అమరావతిలో తిరగాలా? గ్రామాల్లో పోలీసులు కవాతు చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నల్ని సంధించటంతో పాటు.. 144 సెక్షన్ ను అమలు చేస్తున్న వేళ.. పోలీసుల తీరును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగత పని మీద వెళుతున్న తనతో పోలీసులు ఎలా వ్యవహరించారో స్వయంగా అనుభవంలో ఉందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.కోర్టులో బయటపెట్టటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన మాటలు విన్నప్పుడు.. 144వ సెక్షన్ పేరుతో పోలీసుల తీరును తప్పు పట్టింది.

అంతేకాటు.. 144వ సెక్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జమ్ముకశ్మీరుకు సంబంధించినవని.. అవి తమకు వర్తించమని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాతో చెప్పిన విషయాలపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య కోర్టు ధిక్కారానికి పాల్పడటమేనని పేర్కొంది. పోలీసులు 144వ సెక్షన్ పేరుతో సామాన్యుల్ని ఏ రీతిలో ఇబ్బంది పెడతారన్న విషయాన్ని కోర్టు సాక్షిగా న్యాయమూర్తి పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News