ఏపీ సర్కార్ పై మరో సారి హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏపీ సర్కార్ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వరుసగా జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై తీవ్రంగా స్పందించింది. ఏపీలో పరిస్థితులు అదుపులో లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ మధ్యకాలంలో సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం.. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
తాజాగా రాజధాని బిల్లులపై పిటీషన్ ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రాజధాని బిల్లులను ఆమోదించలేదని శాసనమండలి రద్దుకు సిఫార్సు చేశారు. ఎన్నికల కమిషనర్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు.ఇప్పుడు మూడో లక్ష్యం హైకోర్టు. ఇదేం పద్ధతి’ అంటూ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఇక సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే పోలీసులు పట్టించుకోవడం లేదని.. ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందో లేదో నిర్ణయిస్తాం’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.