ఏపీలో నేటి నుండి ఇంటి వద్దకే పింఛన్‌ !

Update: 2020-02-01 05:20 GMT
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం నేటి నుండి అమల్లోకి వచ్చింది. వృద్దులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పింఛన్ అందుకునేందుకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు పింఛన్ పొందుతున్నవారు ప్రతినెల కూడా తమ పింఛన్ డబ్బుని తీసుకోవడానికి చాలా సమయం వెచ్చించేవారు. కానీ , ఇకపై పింఛన్ దారులకి ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇచ్చేలా ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో పింఛన్‌ బ్యాంకు ఖాతాల్లో పడటం, లబ్దిదారులు వెళ్లి పంచాయితీ స్టాఫ్ దగ్గర తీసుకునేవారు. అయితే, ఇలా తీసుకునే సమయంలో కొందరు అధికారు తమ చేతివాటం చూపించేవారు.

కానీ, ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి కమీషన్ ఇవ్వాల్సిన పనిలేదు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ మీ ఇంటికే వస్తుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ బాధ్యత ను నిర్వర్తిస్తారు. వారికి లంచం లాంటివి ఇస్తే..ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు ఇద్దరూ జైళ్లకే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ లో 54.64 లక్షల లబ్దిదారుల ఇళ్లకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పెన్షన్ చేరుతుంది. ఎవరికైనా అనివార్య కారణాలు వల్ల పెన్షన్ తీసుకోలేకపోతే.. ఆదివారం లోపు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 8 గంటలకు సీఎం జగన్ ప్రారంభించారు.
Tags:    

Similar News