మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్?

Update: 2020-10-04 06:50 GMT
మద్యపాన నిషేధం దిశగా ఆలోచిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్రంలో మద్యం రేట్లను భారీగా పెంచింది. మంచి బ్రాండెడ్ మద్యం కూడా ఏపీలో దొరకడం లేదు. దీంతో తెలంగాణ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఖరీదైన మద్యం ఏపీలోకి వెల్లువెత్తుతోంది.

ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మందుబాబులు మద్యం తెప్పించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిల్స్ తెచ్చుకోవచ్చంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. దీనివల్ల ఎక్సైజ్ శాఖకు ఆదాయం తగ్గుతోంది.

ఈ పరిణామంతో ఏపీ ఆదాయం పడిపోతోంది. పైగా ఈ కారణంగా ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తెచ్చుకునే వీలు కూడా కలిగింది. అందుకే అలాంటి వీల్లేకుండా చట్టసవరణ చేయాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడానికి కుదరకుండా ఈ చట్టం రూపొందించాలని యోచిస్తోంది.

ఏపీ సర్కార్ భారీగా పెంచిన మద్యం రేట్లతో సర్కార్ కు ఆదాయం పెరిగింది. కానీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా అక్రమ మద్యం వివిధ వినూత్న మార్గాల్లో ఏపీలోకి వస్తోంది. దీనివల్ల ఏపీకి వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ క్రమంలోనే చట్టసవరణ చేసి దీన్ని అరికట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
Tags:    

Similar News