భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2020-07-26 06:30 GMT
దూకుడైన నిర్ణయాలతో ప్రభుత్వ పాలనను పరిగెత్తిస్తున్న జగన్ మరోసారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ధాలుగా స్తబ్దుగా ఉన్న భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు జగన్ సర్కార్ సిద్ధమైనట్లు సమాచారం. పట్టణాలు.. నగరాల్లోని వ్యవసాయ భూములు.. అపార్ట్ మెంట్లు, ఖాళీ స్థలాల విలువను ఆగస్టు 1 నుంచి పెంచడానికి రెడీ అయినట్లు తెలిసింది.

ఏపీలోని ఆయా ప్రాంతాల డిమాండ్లను బట్టి 5 నుంచి 50శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన ధరలు అమల్లోకి వస్తాయి.  

కరోనా వైరస్ దెబ్బతో ఏప్రిల్ మే నెలల్లో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. మార్కెట్ విలువలు ఎప్పటి దశాబ్ధాల కింద సవరించారు. తాజాగా ఆర్సీసీ భవనాలు.. రేకుల షెడ్లు, పౌల్ట్రీలు ఇలా అన్నింటి విలువను చదరపు అడుగుకు రూ.20-40 వరకు పెంచింది. గ్రామాల్లోనూ నిర్మాణాల ధరలను రూ.20-30వరకు పెంచారు. పూరి గుడిసెలకు ఎలాంటి పెంపు లేదని స్పష్టమైంది.
Tags:    

Similar News