షూటింగ్ లకు కేసీఆర్ అనుమతి చాలా? జగన్ ది అక్కర్లేదా?
తెలుగు సినిమా షూటింగ్ లకు తెలంగాణ సర్కారు ఓకే చెప్పటం తెలిసిందే. దీంతో.. లాక్ డౌన్ అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్లైంది. సర్కారు నుంచి సానుకూల స్పందన రావటంతో టాలీవుడ్ ప్రముఖులు సంతోషంతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇక్కడే కొత్త వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రితో మాట్లాడితే సరిపోతుంది. మరిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీఎంను షూటింగ్ లకు అనుమతి అడిగి.. ఏపీ సీఎంను అడగకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న గా మారింది.
తెలంగాణ సీఎం ఓకే అనటంతోనే విషయం పూర్తి కాదని.. అందుకు ఏపీ సీఎం జగన్ అంగీకారం ఉండాలన్న విషయాన్ని కొందరు ప్రస్తావించటంతో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. తొలుత.. తెలంగాణ సర్కారు చేత ఓకే చెప్పించుకోవటం పైనే ఫోకస్ పెట్టిన ప్రముఖులంతా ఏపీ వ్యవహారాన్ని పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. ‘‘షూటింగ్ లను తెలంగాణకు పరిమితం చేద్దాం సరే.. మరి ఏపీ సంగతేంటి? షూటింగ్ అనుమతుల్ని తెలంగాణ సీఎంను ఎలా అడిగారో.. ఏపీ ముఖ్యమంత్రిని అడగాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో పట్టింపులకు పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని సినీ ప్రముఖుడు ఒకరు చేసినట్లుగా చెబుతున్న వాదన వాస్తవానికి దగ్గరగా ఉందంటున్నారు.
షూటింగ్ ల అనుమతి కోసం తెలంగాణ సీఎంను కోరినట్లుగా.. ఏపీ ముఖ్యమంత్రిని కోరాల్సిన అవసరం ఉందంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులు ఏపీకి వెళ్లటం ఇప్పటికిప్పుడు వీలు కాకున్నా.. అడగాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోలేదన్న సంకేతాల్ని పంపాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కానీ నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తి మాట టాలీవుడ్ ప్రముఖులపై బాగానే పని చేసినట్లుగా తెలుస్తోంది.