టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం బిగ్ ఆఫర్

Update: 2020-05-29 06:30 GMT
సినిమా షూటింగ్ లకు, థియేటర్స్ కు అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజులుగా టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే సినిమా షూటింగ్స్ లో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతాయి.  చాలా మంది నటులు హైదరాబాద్ లో నివసిస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వంతోనే టాలీవుడ్ కు బాగా బంధం కలిగి ఉంది.

మహమ్మారి వైరస్ వ్యాప్తి తరువాత.. సినిమాలు - సీరియళ్ల షూటింగ్ లు - థియేటర్స్ అన్నీ బంద్ అయిపోయాయి. సినీ నటులు - సినీ కార్మికులంతా ఉపాధి కోల్పోయారు. దీంతో అన్నింటికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం సినిమాలు, సీరియళ్లకు మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వలేదు.  దీంతో సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. సినిమా షూట్లకు అనుమతి ఇవ్వలని అభ్యర్థించారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వతహాగా ముందుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తులు - ఆడవుల్లో ఒక్క రూపాయి చార్జ్ చేయకుండా ఉచితంగా అనుమతి ఇవ్వడానికి అనుమతులు ఇచ్చింది.

అంతేకాదు.. పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖను ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేయడానికి వీలుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులకు వైజాగ్ లో భూములను కేటాయించే యోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై చిరంజీవి - వైఎస్ జగన్ కూడా ఇటీవల ఫోన్లో మాట్లాడుకున్నారు. వైజాగ్ అభివృద్ధిపై చర్చ జరిగినట్టు తెలిసింది.

విశాఖ దాని చుట్టుపక్కల ఫిల్మ్ స్టూడియోల కోసం ప్రభుత్వం ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్దంగా ఉందని జగన్ తెలిపినట్లు తెలిసింది. చిరంజీవితోపాటు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వైఎస్ జగన్ ను కలవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రయోజనాలను ఉపయోగించుకునే ప్రణాళికలను  రూపొందించడానికి టాలీవుడ్ ప్రముఖులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. .
Tags:    

Similar News