జ్యూడిషియరీ ఈజ్ బ్లీడింగ్.. సుప్రీం సీరియస్

తాజాగా జరిగిన విచారణలో సీజేఐ సీరియస్ అయ్యారు. ఎన్ సీఈఆర్ టీ తరఫు సొలిసిటర్ జనరల్ కోర్టుకు క్షమాపణలు తెలియజేయగా.. సీజేఐ దాన్ని తోసిపుచ్చారు.;

Update: 2026-02-26 12:30 GMT

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పేరుతో ఎన్ సీఈఆర్ టీ ఇటీవల ప్రచురించిన పాఠ్య పుస్తకాల వ్యవహారం పెను సంచనలంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు నిర్వహించిన విచారణ సందర్భంగా తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ప్రచురణ. పున:ముద్రణతో పాటు డిజిటల్ పంపిణీపై కోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఇప్పటికే మార్కెట్ లోకి స్కూళ్లకు వెళ్లిన అన్ని పుస్తకాల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లు, ఎన్ సీఈఆర్ టీ వెబ్ సైట్ నుంచి ఈ పుస్తకానికి సంబంధించిన పీడీఎఫ్ ఫైళ్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదాస్పద కంటెంట్ వెనుక ఉన్న అసలు కారణాల్ని వివరించటంతో పాటు.. వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని కోరుతూ ఎన్ సీఈఆర్ టీ, విద్యాశాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఈ పాఠ్యాంశాల్ని రూపొందించిన వారు ఎవరు? ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు? లాంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక తమకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ ఉత్తర్వులు అమలు చేసి.. రెండు వారాల్లో సమగ్ర రిపోర్టును సమర్పించాలని కోర్టు పేర్కొంది.

ఈ వ్యవహారంపై ఎన్ సీఈ ఆర్ టీ బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. ఈ అధ్యాయాన్ని సమర్పించి.. నిపుణుల సలహాతో తిరిగి రాస్తామన్న హామీ ఇచ్చింది.తాజాగా జరిగిన విచారణలో సీజేఐ సీరియస్ అయ్యారు. ఎన్ సీఈఆర్ టీ తరఫు సొలిసిటర్ జనరల్ కోర్టుకు క్షమాపణలు తెలియజేయగా.. సీజేఐ దాన్ని తోసిపుచ్చారు. ఎన్ సీఈఆర్ టీ పంపిన నోట్ లో ఒక్కచోట కూడా క్షమాపణ లేదని.. పైగా వారు పంపిన నోట్ లో తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. వివాదాస్పద పాఠ్యాంశాలను రూపొందించిన వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వటంపై స్పందించిన సీజేఐ.. ఇప్పటికే వారు పిస్టల్ తో కాల్పులు జరిపారని.. ఇప్పుడు న్యాయవ్యవస్త రక్తం ఓడుతోందన్నారు. "కేవలం తొలగించటం వల్ల ప్రయోజనం లేదు. వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు' అంటూ స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ అవినీతిమయమని విద్యార్థులకు.. ఉపాధ్యాయులకు బోధిస్తే సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? అని ప్రశ్నించిన సీజేఐ.. "తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిని నేర్చుకుంటే వ్యవస్థపై నమ్మ కం ఏమవుతుంది?" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదని.. న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించటానికి లోతైన.. పక్కాగా ప్లాన్ చేసిన కుట్రగా అభివర్ణించారు.

న్యాయవ్యవస్థపై దాడులు పెరుగుతున్న సమయంలోనూ తాము ఎంతో సంయమనం.. సమతుల్యతను పాటిస్తున్నామని.. ఇలాంటి ఉద్దేశపూర్వక దాడుల్ని సహించమన్నారు. " సంస్థ అధిపతిగా దీనికి బాధ్యులైన వారు ఎవరని తేల్చటం నా బాధ్యత. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే"అని స్పష్టం చేశారు. అనంతరం ఎన్ సీఈఆర్ టీ డైరెక్టర్, విద్యాశాఖ కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News