ముందస్తు ఎన్నికలు : అవుట్ అయ్యేదెవరు...?
ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఏపీలో ఎందుకు ముందస్తు ఎన్నికలు వస్తాయని లాజికల్ గా ఆలోచిస్తే జవాబు ఉండదు. ఉదాహరణకు వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందనుకుంటే అది పూర్తిగా ఆ ప్రభుత్వం వైఫల్యంగా ముందే చెప్పుకుని ఒప్పుకున్నట్లు అవుతుంది.
ఎందుకంటే ఆ పార్టీకి జనాలు 151 సీట్లతో భారీ మెజారిటీని ఇచ్చారు. అయిదేళ్ళు ఏ చిక్కులూ చికాకులూ లేకుండా పాలించమని స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఏడాది అధికారం ఉండగానే వదిలేసుకుని వైసీపీ ఎన్నికలకు సిద్ధపడడం రాజకీయంగా ఎంతవరకూ కరెక్ట్ వ్యూహమో తెలియదు కానీ జనాల వైపు నుంచి చూస్తే వారు దానిని తోసిపుచ్చుతారనే అంటున్నారు.
అయిదేళ్ళ పాటు పాలించలేని వారు మళ్ళీ అధికారం కోసం ఎలా అడుగుతారు అని విపక్షాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనాలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారు. ముందస్తు ఎన్నికలు ఈ మధ్య హడావుడి మొదలవగానే సోషల్ మీడియాలో వైసీపీకి యాంటీగా పోస్టింగులు పడ్డాయి.
ముప్పయ్యేళ్ళ అధికారం అంటున్న వారు నాలుగేళ్ళకే జారిపోతున్నారు అని సెటైరికల్ గా కూడా పోస్టులు పెట్టాఅరు. ఇది జనమలోనూ రాజకీయంగానూ ఉండే వాతావరణం అయితే ఇక వైసీపీకి ముందస్తు వల్ల విజయాలు ఏమైనా అదనంగా వస్తాయా అంటే అది ఒక అంచనా తప్ప ఏమీ లేదు. నిజానికి ముందస్తు కాదు కానీ మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఉపయోగం ఉంటుంది.
అంటే సగం పాలన తరువాత అన్న మాట. అలా 1983లో అన్న గారు అధికారంలోకి వచ్చి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. దానికి ఆయనకు బలమైన కారణం ఉంది. కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిందంటే ఒక్క ఓటుతో ఓడింది కాబట్టి. అలా బలమైన కారణాలు ఉంటే అవి వర్కౌట్ అవుతాయి.
నాలుగేళ్ళ పాటు పాలించి చివరి ఏడాది అయినా ఆరు నెలలు అయినా ఎన్నికలకు వెళ్ళినా జనాల మూడ్ లో ఏమీ మార్పు ఉండదు, తెలంగాణాలోనూ అదే జరిగేది కానీ 2018లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పొత్తుని బూచిగా చూపించి చివరి నిముషంలో కేసీయార్ తెలంగాణా సెంటిమెంట్ ని రెచ్చగొట్టడంతో అది ఫలించి ఆయన సీఎం కాగలిగారు. ఏపీలో అలాంటి పరిస్థితి అయితే లేదు.
ఇక జగన్ సర్కార్ నాలుగేళ్ల కాలంలో కేవలం సంక్షేమం మీదనే దృష్టి పెట్టింది. అభివృద్ధి అన్నది లేదు. దానికి రెండేళ్ళ కరోనా అని వారు కారణం చెప్పినా కూడా జనాల వద్ద అది తేలిపోతుంది. ఇక కొన్ని హామీలు అలాగే ఉన్నాయి. దాంతో చివరి ఏడాదిలో ఏమైనా మెరుపులు మెరిపించి ఎన్నికలకు వెళ్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అన్న ఆశ ఉంది. అంతే అది ఇపుడు ఏమీ కాకుండా ఎన్నికలకు వెళ్తే జనాలు యాంటీగా ఉంటే బంగారం లాంటి ఏడాది కాలం అధికారం కూడా పోయినట్లు అవుతుంది.
ఏది ఏమైనా వైసీపీకి చివరి ఏడాది చాలా ముఖ్యమైనది. అందుకే వ్యూహాలు పాలనాలో కొత్త పుంతలు తొక్కడాలూ అన్నింటికీ రెడీ అవడానికే వైసీపీ చూస్తోంది. సో వైసీపీ యాంగిల్ లో చూస్తే ముందస్తు కి అసలు రెడీగా లేదు అనుకోవాలి. ఇక విపక్షం వైపు నుంచి చూస్తే టీడీపీ నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిచేసిన తరువాత కొంత నిబ్బరంగా కనిపిస్తున్నా అది పూర్తిగా నిజం కాదు.
ఆ పార్టీ భయాలు అలాగే ఉన్నాయి. ఒక వైపు పొత్తుల కధ తేలడంలేదు. ఒంటరిగా పోవాలో జంటగా కలవాలో అసలు తేల్చుకోవడంలేదు. ఈ రోజుకీ పార్టీలో చాలా మంది నాయకులు ఇంకా యాక్టివ్ మూడ్ లోకి రావడంలేదు. టికెట్ల పోరు అలాగే ఉంది. జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ గా కధ సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ముందస్తు అంటే రెడీగా లేదు అనే చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీకి మరింత టైం కావాలని అంటున్నారు.
వైసీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత గూడు కట్టడానికి ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు సమయం మాత్రమే కీలకం. కాబట్టి ఈ లోగా ఎన్నికలు అంటే తేడా కొడితే మరో అయిదేళ్ళు టీడీపీ విపక్షంలో కూర్చోవాలి. అదే విధంగా జనసేన సంగతి తీసుకున్నా అధినాయకుడు ఇంకా వారాహి రధం ఎక్కలేదు. ఈసారి ఎన్నికలు ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. పైగా పొత్తులు గౌరవప్రదంగా కుదరాలి. లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇలా చాలా రకాలైన సమస్యలను పరిష్కరించుకోవాలి. సో జనసేనకు కూడా 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితేనే మేలు అన్న భావన ఉంది.
మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు ముందస్తుకు రెడీ అని అంటున్నా కూడా ఎవరూ కూడా ఇంకా ఇల్లు సర్దుకోలేదు అన్నది ఒక విశ్లేషణ. ఇక జనాలు ఎన్నికల మూడ్ లోలేరు. కేంద్రం సైతం ఏపీలో ముందస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సీన్ లేదు. టోటల్ గా ముందస్తు అనుకుంటూ రాజకీయ పార్టీలు భారీ డైలాగులు వల్లించడం తప్ప అయ్యేదీ కాదు పోయేదీ కాదు అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.