డిప్యూటీ సీఎం శ్రీవాణి కూతురి నామ‌క‌ర‌ణం.. జ‌గ‌న్ ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చేలా..!

Update: 2021-02-28 16:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ నేత‌ పాముల పుష్ప శ్రీవాణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ చిన్నారికి నేడు నామకరణ వేడుక‌ నిర్వహించారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం చినమేరంగిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వేడుక‌కు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీతోప‌టు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. అయితే.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీపై త‌మ‌కున్న విధేయ‌త‌ను ఈ సంద‌ర్భంగా చాటుకున్నారు శ్రీవాణి దంప‌తులు. త‌మ చిన్నారికి యశ్విత శ్రీజగతి అని నామ‌క‌ర‌ణం చేశారు.వై అనే అక్షరం కలిసి వచ్చేలా యశస్వి.. ఎస్ అనే అక్షరం వచ్చేలా శ్రీజగతి అని ఆ చిన్నారికి పేరు పెట్టారు. అదేవిధంగా.. జగన్ తోపాటు ఆయన స‌తీమ‌ణి భారతి పేర్లు కలిసి వచ్చేలా జగతి అని నామకరణం చేశారు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పుష్పా శ్రీవాణికి 2014లో వివాహమైంది. ఆమె భర్త శతృచర్ల పరీక్షిత్ రాజు వైఎస్సార్పీపీ అరకు లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకుడిగా ఉన్నారు. వివాహం అనంతరం విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగిలో స్థిరపడ్డారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వ‌చ్చిన శ్రీవాణి.. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
Tags:    

Similar News