అసెంబ్లీ లో ఘర్షణ.. వీడియోలు చూపించి ఎండగట్టిన జగన్

Update: 2019-12-13 05:48 GMT
అసెంబ్లీ గేటు దగ్గర చంద్రబాబు-టీడీపీ నేతల కు, మార్షల్స్ కు మధ్య జరిగిన ఘర్షణ అసెంబ్లీని అట్టుడుకించింది. అసెంబ్లీలోకి రాకుండా తమనకు మార్షల్స్ అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలే మార్షల్స్ పై దౌర్జన్యం చేశారని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో వీడియోలు చూపించి మరీ ఈరోజు ఎదురుదాడికి దిగింది. మార్షల్స్ వారి విధులు నిర్వహిస్తే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే లే దౌర్జన్యం చేశారని వీడియోలో  చూపించి జగన్ సర్కారు షాకిచ్చింది.

మార్సల్స్ తమపై దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం సభలో డిమాండ్ చేయడం తో వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన వైసీపీ ప్రభుత్వం నిన్నటి ఘర్షణ తాలుకూ వీడియోలను శుక్రవారం సభలో ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని సభికులకు చూపించారు. ప్రజలకు కూడా ఈ వీడియోలతో వాస్తవాలు తెలుస్తాయని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున మంత్రి బుగ్గన మాట్లాడారు. ఆ గేటు నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ రాకూడదని చెప్పారు. చంద్రబాబు రూల్స్ బ్రేక్ చేశారని.. ఎమ్మెల్యేలు కాని వారిని కూడా అసెంబ్లీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే మార్షల్స్ అడ్డుకున్నారన్నారు. మార్సల్స్ తప్పు లేదని బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ నేతలదే తప్పు అని వీడియోలతో సహా చూపి ఎండగట్టారు.
Tags:    

Similar News