వైసీపీలో కోలాహలం.. నేడు రెండు పండుగలు!

Update: 2020-07-22 03:45 GMT
వైసీపీలో ఈరోజు ఫుల్ జోష్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతోపాటు ఢిల్లీలో వైసీపీ నుంచి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా నేడు ఉండడంతో అంతటా సందడి నెలకొంది.

ఏపీ కేబినెట్ విస్తరణ ఈరోజు మధ్యాహ్నం 1.29 నిమిషాలకు జరగనుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోపిదేవి, పిల్లి సుభాష్ లు రాజీనామా చేయడంతో వారి సామాజికవర్గానికే చెందిన ఇద్దరికీ జగన్ మంత్రులుగా అవకాశం కల్పించారు.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన రాంచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులు మంత్రులుగా జగన్ ఖరారు చేశారు. గోపాలకృష్ణ జడ్పీచైర్మన్ గా చేశారు. అప్పలరాజు వైద్యవృత్తిలో డాక్టర్ గా చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే కావడం విశేషం.

ఇక అటు ఢిల్లీకి కొత్తగా వైసీపీ తరుఫున రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన మోపిదేవి, పిల్లి సుభాష్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాల్ వెళ్లారు. వైసీపీ సభ్యులతోపాటు మొత్తం దేశవ్యాప్తంగా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 51మంది నూతన సభ్యులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇలా ఇటు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ.. కేంద్రంలో రాజ్యసభ ఎంపీల ప్రమాణంతో సర్వత్రా జోష్ నెలకొంది.
Tags:    

Similar News