మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ...ప్రధాన అజెండా ఇదే !

Update: 2020-10-06 10:30 GMT
దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి  భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, విభజన హామీలు, పెండింగ్ బకాయిల పై మోడీతో జగన్ చర్చించారు. మొత్తం 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే కేంద్ర కేబినెట్‌లో వైఎస్సార్ ‌సీపీ చేరబోతుందనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే  , ఈ వార్తలపై  బీజేపీ,  వైఎస్సార్ ‌సీపీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

ఇకపోతే, ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత సీఎం వైఎస్ జగన్ అపెక్స్  కౌన్సిల్ సమావేశం లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  పాల్గొనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రమంత్రి జల్‌శక్తి మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొంటారు. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపై తమ వాదనల్ని బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండు రాష్ట్రాల్లో ప్రజల్లో ఆసక్తిరేపుతోంది.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ అనంతరం రెండు రాష్ట్రాల జలజగడాలు ఓ కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇక సీఎం జగన్‌ వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌ సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్ ‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఉన్నారు
Tags:    

Similar News