అక్టోబర్‌ 12 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

Update: 2020-09-30 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అసెంబ్లీ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు వచ్చే నెలలో అసెంబ్లీ సమవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రం కరోనా ప్రభావం కాస్త తగ్గడం, కీలక బిల్లులు పెండిం గ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆయా శాఖల మంత్రులు.. ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఒకటో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో శాసనసభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకువి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

 కాగా.. జూన్‌లో బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టిన విషయం విదితమే.
Tags:    

Similar News