• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జర్నలిస్ట్ మనసు దోచుకున్న...

జర్నలిస్ట్ మనసు దోచుకున్న పవన్

By - Tupaki Desk
Update: 2016-03-08 04:32 GMT
‘ఆయనతో నటించటం చక్కటి అనుభూతి. షూటింగ్ టైం అంతా పిక్నిక్ మాదిరి గడిచిపోయింది. చాలా ఎంజాయ్ చేశాం’ ఈ తరహా మాటల్ని తరచూ హీరోయిన్స్ నోటి వెంట వింటుంటాం. సినిమా నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో దాదాపు చాలామంది హీరోయిన్ల నోటి వెంట ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం మామూలే. అయితే.. ఒక హీరోను ఇంటర్వ్యూ చేసిన తర్వాత.. ఆయనతో మాట్లాడటం చక్కటి అనుభూతి కలిగించిందన్న ఫీలింగ్ ఒక ఎత్తు అయితే.. దాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకోవటం మరో ఎత్తు.

అలాంటి ఫీల్ వచ్చేలా చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిత్రపరిశ్రమకు చెందిన అగ్రహీరోల్లో చాలా తక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చే వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరు. రాజకీయాలకు సంబంధించి కూడా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు చాలా అరుదుగా మాత్రమే ఇచ్చే పవన్.. సినిమాలకు సంబంధించిన అంశాలతో ఇచ్చిన ఇంటర్వ్యూలను దాదాపుగా వేళ్ల మీద లెక్కించొచ్చు.

అలాంటి పవన్.. ముంబయికి చెందిన రచయిత్రి.. జర్నలిస్ట్ అయిన అనుపమ చోప్రా అనే ఆవిడకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ ఒకరికి ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా చర్చనీయాంశంగా మారటమే కాదు.. అటు వెబ్ సైట్లలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ ఇదో చర్చగా మారటం చూసినప్పుడు. పవన్ ఇమేజ్ రేంజ్ ఏంట్రా బాబు అనిపించక మానదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పవన్ తో ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత.. అనుపమ చోప్రా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ తో మాట్లాడటం చక్కటి అనుభూతి కలిగించిందని.. ఆయనో అందమైన.. ఆదర్శనీయమైన వ్యక్తిగా పొగిడేశారు. ఇంటర్వ్యూ అయ్యాక ఇలాంటి ఫీలింగ్ తో ట్వీట్ చేసేశారంటే.. ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ పాజిటివ్ గా ఉంటుందా? సస్పైసీ ప్రశ్నలు పెద్దగా ఉండవన్న మాట లాంటి మాటలు వినిపిస్తున్నాయి. కాస్త ఆగితే.. ఇంటర్వ్యూ బయటకు వచ్చేస్తుందిగా.? నిత్యం ప్రముఖుల్ని కలిసి.. వారితో మాట్లాడే ఓ జర్నలిస్ట్ సైతం ఇంప్రెస్ అయి.. ట్వీట్ పెట్టేలా చేశారంటే పవన్ మైండ్ సెట్ ఎంత పాజిటివ్ గా ఉంటుందో చూశారా అన్న మాటలు వినిపిస్తున్నాయ్.
Tags:    
  • Anupama Chopra 
  • Pawan kalyan 
  • Telugu NEws 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS